ఈ రైలు ప్రయాణికులు ఎంత తిన్నా ఫ్రీ ... టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ 2 వేల కి.మీ ప్రయాణించవచ్చు

First Published Oct 7, 2024, 1:25 PM IST

భారతదేశంలో ఉచితంగా ఆహారాన్ని అందించే రైలు సర్వీసు వుందని మీకు తెలుసా? ఈ రైలు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తుందంటే.. 

Free Food in Train

Free Food in Train : భారతీయ ప్రజా రవాణా వ్యవస్థల్లో రైల్వేది అత్యంత కీలక పాత్ర. సుదూర ప్రాంతాలకు పిల్లాపాపలు, భారీ లగేజీతో ప్రయాణించేవారు రైల్వే ప్రయాణాన్ని కోరుకుంటారు. ఇక స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ విహారయత్రలకు వెళ్లాలనుకునేవారు, కుదుపులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వృద్దులు, కాలేజీ స్టూడెంట్స్, ఉద్యోగులు... ఇలా ప్రతి ఒక్కరు రైల్వే ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే సౌకర్యవంతమైన  ప్రయాణంతో పాటు ఉచితంగానే ఫుడ్ దొరికితే... ఆ ప్రయాణం  మరింత సుఖమయం. ఇలా ఫ్రీ ఫుడ్ దొరికే రైల్వే సర్వీస్ ఒకటి మన దేశంలో కొనసాగుతోంది. 

Free Food in Train

దూర ప్రాంతాలకు రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా వుంటుంది ... కానీ ఫుడ్ విషయంలోనే ఇబ్బందిపడాల్సి వస్తుంది. రైళ్లలో అందించే ఆహారం రుచి, శుచి లేకుండా వుంటాయి. కడుపు మాడ్చుకోకుండా వుండేందుకే తినడంతప్ప రైల్వే ఫుడ్ ఎవ్వరూ ఇష్టంగా తినరు. అలాగని చాలారోజుల ప్రయాణానికి ఇంటినుండి ఆహారం తీసుకెళ్లలేం... వండుకుని తీసుకెళ్లినా ఒకటి రెండు రోజులకే సరిపోతుంది. 

ఇలా ఏ రైలులో ప్రయాణించినా ఫుడ్ విషయంలో ఇబ్బందులు తప్పవు. కానీ ఓ రైలు ప్రయాణంలో ఫుడ్ గురించి అస్సలు బాధ వుండదు. ప్రయాణికలు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించవచ్చు. ఇలా ఒకటి కాదు  రెండు కాదు వేల కిలోమీటర్ల ప్రయాణంలో ఉచితంగానే వేడివేడి ఆహారాన్ని అందుకుంటారు ప్రయాణికులు. ఇలా రైలు జర్నీని ఎంజాయ్ చేస్తూ ఫ్రీగా రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.  
 

Latest Videos


Free Food in Train

ఈ రైలులో ప్రయాణికులకు ఫ్రీ ఫుడ్ : 

సిక్కుల పవిత్రస్థలం అమృత్ సర్. పంజాబ్ లోని ఈ నగరంలో స్వర్ణ దేవాలయాన్ని (హర్మందిర్ సాహిబ్) లక్షలాది మంది సిక్కులు సందర్శిస్తుంటారు. అయితే ఇక్కడి నుండి సిక్కుల మరో పుణ్యక్షేత్రమైన నాందేడ్ హజూర్ సాహిబ్ సందర్శనకు వెళుతుంటారు. ఇలా పంజాబ్ నుండి మహారాష్ట్రకు నిత్యం సిక్కుల ఆద్యాద్మిక యాత్ర కొనసాగుతుంటుంది.  

అమృత్ సర్, నాందేడ్ మధ్య సిక్కుల ఆద్యాత్మిక యాత్ర నేపథ్యంలో భారత రైల్వే సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్ (12715) నడుపుతుంది.  ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రతిరోజు నడుస్తుంది... దేశ రాజధాని న్యూడిల్లీ, భోపాల్ ల మీదుగా ప్రయాణిస్తూ గురుద్వారాలను కలిపే అతి ముఖ్యమైన రైలు సర్వీస్.  

అయితే అమృత్ సర్, నాందేడ్ మధ్య దూరం 2,081 కిలోమీటర్లు. ఇంతదూరం తమ పవిత్ర స్థలాల సందర్శన కోసం సిక్కులు ప్రయాణిస్తుంటారు... కాబట్టి ఈ రైలు ప్రయాణికులు ఆకలి తీర్చేందుకు ఉచితంగానే  ఆహారం అందిస్తారు. రుచికరమమైన వేడివేడి పంజాబి వంటకాలను ప్రయాణికులకు అందిస్తారు. 
 

Free Food in Train

అమృత్ సర్, నాందేడ్ మధ్య నడిచే ఈ సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్ వివిధ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. మొత్తం 39 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఇలా ఈ రైలు ఆగే స్టేషన్లలోనే ఉచిత ఆహారాన్ని అందిస్తారు. మొత్తం ఆరు రైల్వే స్టేషన్లలో ఈ భోజన ఏర్పాట్లు చేసారు. తమవారి కోసం వివిధ ప్రాంతాల్లోని సిక్కులు ఈ లంగర్ (కమ్యూనిటి కిచెన్) ను ఏర్పాటుచేసారు. 

1995 లో ప్రారంభమైన ఈ రైలు సర్వీస్ గతంలో వారానికోసారి వుండేది.అయితే 2007 నుండి రోజువారి సర్వీస్ గా మార్చారు. ఇలామూడు దశాబ్దాలుగా ఈ సచ్‌ఖంద్ ఎక్స్ ప్రెస్ సేవలు కొనసాగుతున్నాయి... ప్రతిరోజూ 2 వేల మందికిపైగా ప్రయాణికులు ఈ రైలు సర్వీస్ ను ఉపయోగించుకుంటారు.  ఈ రైలులో ఆధ్యాత్మిక యాత్ర సాగుతుంది కాబట్టి ప్రయాణికులందరికీ ఉచితంగానే భోజనం అందిస్తారు. 

ఈ సచ్‌ఖంద్ ఎక్స్ ప్రెస్ ప్రయాణించే మన్మాడ్, డిల్లీ, భుసావల్, భోపాల్, గ్వాలియర్, నాందేడ్ రైల్వే స్టేషన్లలో ఉచిత భోజన సదుపాయం కల్పిస్తారు. సిక్కుల పవిత్ర స్థలాలైన గురుద్వారాల ఆధ్వర్యంలో ఈ లంగర్ కొనసాగుతుంది. ప్రతిరోజు కథీ చావల్, దాల్, సబ్జీ వంటి శాఖాహార భోజనాన్ని రెడీ చేసి వేడివేడిగా ప్రయాణికులకు వడ్డిస్తారు. ఈ రుచికరమైన భోజనం కడుపునిండా హాయిగా ప్రయాణం కొనసాగిస్తారు సచ్‌ఖంద్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులు. 

click me!