ఇవాళ రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు ... మీకు వస్తాయో లేదో ఇలా చెక్ చేసుకొండి

First Published | Oct 5, 2024, 11:55 AM IST

శరన్నవరాత్రి సంబరాల వేళ దేశ ప్రజలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇవాళ అన్నదాతల ఖాతాల్లో రూ,2 వేలు జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకోసమో తెలుసా?

PM Kisan

PM Kisan : దసరా పండక్కి ముందే దేశ ప్రజలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన మరో విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇవాళ (సెప్టెంబర్ 5, 2024) అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్రలో   పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాషిమ్ జిల్లాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులను చేయనున్నారు. ఇలా రూ.20,000 కోట్ల రూపాయలను పీఎం కిసాన్ పథకం కోసం విడుదల చేయనుండగా... అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రెండు వేల రూపాయలు జమ కానున్నాయి.  
 

PM Kisan

ఏమిటీ పీఎం కిసాన్ పథకం? 

దేశ ప్రజలందరి ఆకలి తీరుస్తున్న రైతన్నకు ఆకలి బాధ తప్పడంలేదు. ప్రకృతి వైఫరిత్యాల కారణంగా పంటలు దెబ్బతిని కొందరు... పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మరికొందరు... నకిలీ విత్తనాల కారణంగా పంట  సరిగ్గా పండక ఇంకొందరు...  ఇలా కారణమేదైనా ప్రతిసారి నష్టపోయేది రైతే.  గొడ్డులా కష్టపడ్డా రైతు లాభాలు పొందే సందర్భాలు చాలా అరుదు... ప్రతిసారి అతడికి మిగిలేది నష్టమే.  

ఇలా నష్టాలతో కూడుకున్నా రైతులు వ్యవసాయాన్ని వీడలేకపోతున్నారు. ఇలా ప్రజల ఆకలి బాధను తీర్చేందుకు శ్రమిస్తున్న రైతాంగానికి ఆర్థిక సాయం చేసేందుకు మోదీ సర్కార్ ముందుకువచ్చింది. పంటలు వేసే సమయంలో పెట్టుబడికోసం ఇబ్బంది పడకుండా రైతులకు ఆర్థికసాయం చేస్తోంది కేంద్రం ప్రభుత్వం. ఇదే  పీఎం కిసాన్ పథకం.   

ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర 2019 ఫిబ్రవరి 24న ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో ప్రారంభించారు. ప్రతి ఏడాది అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో ఓ విడతలో రూ.2 వేలు జమ చేస్తారు... ఇలా మూడు విడతల్లో రూ.6 వేలు జమ చేస్తారు. ఇలా ఇప్పటివరకు 17 విడతల  పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పుడు 18వ విడత పీఎం కిసాన్ నిధులు కూడా రైతుల ఖాతాలో జమ కానున్నాయి. 
 

Latest Videos


PM Kisan

పీఎం కిసాన్ పథకానికి అర్హులెవరు? 

ప్రధాన మంత్రి కిసాన్ పథకానికి చిన్న సన్నకారు రైతులే అర్హులు.  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సాగుభూమి కలిగిన రైతులకు ఈ పెట్టుబడి సాయం అందుతుంది.అధికంగా వ్యవసాయ భూమిని కలిగివున్నా, ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పొందుతున్నా, పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈ పథకానికి అనర్హులు. 

ఇక ఆదాయ పన్ను దాఖలుచేసిన రైతులు కూడా ఈ పథకానికి అనర్హులే. పదవీ విరమణ పొంది రూ.10వేల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు. ప్రజా ప్రతినిధులు అంటే మంత్రులు, ఎమ్మెల్యేల నుండి గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ లు కూడా పిఎం కిసాన్ సాయానికి అనర్హులే.  

మొత్తంగా అతి తక్కువ వ్యవసాయ భూమిని కలిగి... అతి తక్కువ ఆదాయం కలిగిన రైతులకే ఈ పథకం వర్తిస్తుంది. ఈ రైతులకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏటా మూడుసార్లు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
 

PM Kisan

పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు వుందో లేదో ఇలా తెలుసుకొండి : 

 మీ అకౌంట్లో ప్రధాన మంత్రి కిసాన్ యోజన డబ్బులు పడాలంటే తప్పకుండా ఇ-కెవైసి తప్పనిసరి. అన్ని అర్హతలు వుండి ఈ కెవైసి పూర్తిచేసిన రైతుల ఖాతాల్లో ఇవాళ రూ.2 వేలు జమ అవుతాయి. మీ పేరు పిఎం కిసాన్ అర్హుల జాబితాలో వుందో లేదో తెలుసుకోడానికి అధికారిక వెబ్ సైట్ www.pmkisan.gov.in ను సందర్శించండి. 

ఈ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో బెనిఫిషరీ లిస్ట్ కూడా వుంటుంది... దీనిపై క్లిక్ చేయండి. మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో ఆ గ్రామంలోని లబ్దిదారుల జాబితా వస్తుంది.  ఇందులో మీ పేరు వుందో లేదో చెక్ చేసుకొండి. ఈ జాబితాలో మీ పేరు వుందంటే మీ ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి.
 

పీఎం కిసాన్ ఇ-కేవైసి ఎలా చేసుకోవాలంటే :

ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ​ https://pmkisan.gov.in/ ను ఓపెన్ చేయండి. అందులో e‌-KYC ఆప్షన్ ను క్లిక్ చేయండి. 

మీ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీంతో ఇ-కేవైసి వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఓటిపి సాయంతో ఈ ప్రక్రియన పూర్తి చేయండి. 

అయితే ఇతర మార్గాల్లోనూ ఇ‌-కేవైసి పూర్తి చేయవచ్చు.  పీఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి కూడా ఇ-కేవైసి పూర్తి చేయవచ్చు. ఇక కామన్ సర్వీస్ సెంటర్ లో కూడా దీన్ని పూర్తి చేయవచ్చు. 
 

click me!