2021 లో ఎన్ని గ్రహాలు రానున్నాయో తెలుసా..? అవి భారత్ లో కనిపిస్తాయా?

First Published Dec 28, 2020, 10:14 AM IST


వచ్చే ఏడాది మేలో గ్రహణం ఏర్పడుతుంది. మే నుంచి డిసెంబరు వరకు 4 గ్రహణాలు సంభవిస్తాయి. ఈ నాలుగింటిలో రెండింటిని భారత్ లో వీక్షించవచ్చు.

2020 ముగిసింది. మరో మూడు రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. కాగా.. ఆ నూతన సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వాటిలో రెండు సూర్య గ్రహణాలు కాగా.. మరో రెండు చంద్ర గ్రహణాలు. అయితే.. వీటిలో రెండు మాత్రమే భారత్ లో కనిపించనున్నాయట.
undefined
వచ్చే ఏడాది మేలో గ్రహణం ఏర్పడుతుంది. మే నుంచి డిసెంబరు వరకు 4 గ్రహణాలు సంభవిస్తాయి. ఈ నాలుగింటిలో రెండింటిని భారత్ లో వీక్షించవచ్చు.
undefined
2021లో మే 26న తొలి గ్రహణం ప్రారంభం కానుంది. ఇది చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారత్ లో కనిపిస్తుంది. కానీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గ్రహణాన్ని చూడగలుగుతారు.
undefined
ఇది భారత్ లో ఈశాన్య భాగాంలోని చంద్రకాంతి సమయంలో గ్రహణం జరుగుతున్నప్పుడు కనిపిస్తుంది. ఈ గ్రహణాన్ని నాగాలాండ్, మిజోరాం, అసోం, త్రిపుర, తూర్పు ఒడిషా, అరుణాచల్, పశ్చిమ బంగాల్లోని ప్రజలు వీక్షించవచ్చు.
undefined
వచ్చే ఏడాది జూన్ 21న రెండో గ్రహణం సంభవించనుంది. ఇది సూర్యగ్రహణం అవుతుంది. 2021లో మొదటి చంద్రగ్రహణం మాదిరే ఈ సూర్యగ్రహణాన్ని కూడా భారత్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో చూడవచ్చు.
undefined
ఈ గ్రహణం ముగిసేలోపు ఈశాన్యం భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, జమ్ము-కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో వీక్షించవచ్చు. ఈ గ్రహణం దేశంలోని ఇతర ప్రాంతాల్లో కనిపించదు.
undefined
2021లో మూడో గ్రహణం చంద్రగ్రహణం కానుంది. ఈ గ్రహణం నవంబరు 19న కార్తిక పౌర్ణమి రోజు సంభవించనుంది. ఈ గ్రహణం ప్రారంభమైన కొద్దిసేపటికే ఇది ముగుస్తుంది. కాబట్టి.. పెద్దగా కనిపించే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపు కనిపించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
undefined
వచ్చే సంవత్సరం చివరి గ్రహణం డిసెంబరు 4న ఏర్పడనుంది. ఇది సూర్యగ్రహణం కానుంది. భారత్ లో ఎక్కడా కనిపించని ఏకైక గ్రహణం ఇదే. అందువల్ల ఈ సూర్యగ్రహణం భారత్ లో ఎలాంటి ప్రభావం చూపదు. ఫలితంగా సూతక కాలం వర్తించదు.
undefined
click me!