అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని తుండ్లాలో శనివారం ముఖ్యమంత్రి సామూహిక కళ్యాణోత్సవం నిర్వహించారు. ఇందులో 51 జంటలు వివాహం చేసుకున్నాయి. వీరందరికీ పెళ్లి ఖర్చులను ప్రభుత్వమే భరించింది. ఈ వేడుకలో వివాహ బంధంతో ఒక్కటైన జంటలకు గృహోపకరణాలు, దుస్తులు, ఇతర నిత్యావసరాలను అందించారు.