తమిళనాడు : తమిళనాడులో ఓ జుగుస్సాకరమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి మాయ మాటలతో.. ఒకరు, ఇద్దరు..కాదు ఏకంగా నలుగురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందులో.. రెండో భార్య రెండో కూతురు కూడా ఉండడం గమనార్హం. ఆ బాలిక ఇప్పుడు గర్భం దాల్చింది. దీంతో విషయం వెలుగు చూసింది. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది.
27
కామాంధుడైన ఆ వ్యక్తిని సేలం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు కన్నియాకుమారి జిల్లా ఇరుళ్ పురం అనే గ్రామానికి చెందిన విశ్వ(25). ఇతను ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని…ఆ తర్వాత ఆమెను వదిలేసి ఇద్దరు పిల్లలు ఉన్నా మరో వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు.
37
ఈ క్రమంలో ఇంకో మహిళతో వివాహేతర సంబంధం, కొద్ది కాలం తర్వాత రెండో భార్య రెండో కూతురుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మొదట విశ్వ 2022లో ఓ బట్టల దుకాణంలో పనిచేసేవాడు. ఆ సమయంలో అక్కడే పని చేసే ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత ఆమెను వదిలేశాడు.
47
బట్టల దుకాణంలో పని కూడా మానేసి ఒక జ్యూస్ షాపులో పనికి చేరాడు. ఆ షాపుకి 40 ఏళ్ల మహిళ తరచుగా వస్తుండేది. ఆమెకి భర్త చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలున్నారు. ఆ మహిళతో మాటలు కలిపి మాయమాటలతో.. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తన నివాసం సేలంకు మార్చాడు.
57
Extra Marital Affairs- Why do boys who get married in love have an illicit relationship
అక్కడికి వెళ్లిన తర్వాత పొరుగింటి మహిళతో ఇలాంటి ట్రాప్ అనుసరించాడు. ఆమెను కూడా మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడు. ఈ విషయం రెండో భార్యకు తెలిసింది. అతని సంగతి తెలియకుండా పెళ్లి చేసుకున్న రెండో భార్య ఆ పొరుగింటి మహిళను కూడా తమతోపాటే ఉండమని చెప్పి ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో. ఉంటున్నారు.
67
extra marital affair
ఇలా కొద్ది రోజులు గడచిన తర్వాత రెండో భార్య, ఆమె ఇద్దరు కూతుర్లతో మరో వీధిలోకి ఇల్లు మారాడు విశ్వం. అలా రెండో భార్య ఇంటికి వెళ్లి వచ్చే క్రమంలో.. రెండో భార్య రెండో కుమార్తెకు మాయమాటలు చెప్పి లోపరుచుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.
77
ఈ విషయం బాలిక బంధువులకు తెలియడంతో గొడవ చేశారు. అంబాపేట ఆల్ ఉమెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశ్వను అరెస్టు చేసి పోలీసులు విచారణ చేపట్టగా.. అతని వివాహేతర సంబంధాలు పెళ్లిళ్ల గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.