వివాహేతర సంబంధం : సెల్ఫీ తీసుకుందామంటూ తీసుకెళ్లి.. భర్తను చెట్టుకు కట్టేసి నిప్పంటించిన భార్య..

Published : Jun 13, 2023, 07:47 AM IST

సెల్ఫీ తీసుకుందామంటూ తీసుకెళ్లి భర్తను చెట్టుకు కట్టేసి, నిప్పంటించింది ఓ భార్య. ఈ దారుణ ఘటన బీహార్ లో వెలుగు చూసింది. 

PREV
16
వివాహేతర సంబంధం : సెల్ఫీ తీసుకుందామంటూ తీసుకెళ్లి.. భర్తను చెట్టుకు కట్టేసి నిప్పంటించిన భార్య..

బీహార్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో జరుగుతున్న దారుణాలకు అంతులేకుండా పోతుంది. ఏ మాత్రం తప్పు చేస్తున్నామన్న భావన.. హింసకు పాల్పడుతున్నామన్న ఆలోచన లేకుండా చాలా సింపుల్ గా.. భాగస్వాములను హతమారుస్తున్నారు. అలాంటి ఘటనలో ఓ భార్య చేసిన పని..  అత్యంత అమానవీయంగా, పాశవికంగా ఉంది. 

26

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తని చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించింది ఓ భార్య. వింటుంటే షాకింగ్ గా ఉన్న ఈ ఘటన బీహార్లో వెలుగు చూసింది.  భర్తను సెల్ఫీ తీసుకుందామంటూ ఓ చెట్టు దగ్గరికి తీసుకు వెళ్ళింది. ఆ తర్వాత అతడిని చెట్టుకు కట్టేసింది. 

36

అతడి మీద కిరోసిన్ పోసి, నిప్పు అంటించింది. బీహార్ లోని ముజఫర్పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..

46

ముజఫర్పూర్ జిల్లాలోని వాసుదేవ్పూర్ సరాయి గ్రామానికి చెందిన  25 ఏళ్ల ఓ మహిళకు గ్రామంలో మరొకరితో వివాహేతరసంబంధం ఉంది. ఈ నేపథ్యంలో కట్టుకున్న భర్త ఆమెకు అడ్డుగా తోచాడు. ఎలాగైనా అతడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. శనివారం రాత్రి సెల్ఫీ తీసుకుందామంటూ భర్తను నమ్మించి, ఓ చెట్టు దగ్గరికి తీసుకువెళ్లింది. 

56

ఆ తర్వాత చెట్టుకు కట్టేసి, అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. భార్య ఏం చేస్తుందో అర్థం కాని అతను అయోమయంగా చూస్తుండగానే అతడి ఒంటిపై కిరోసిన్ పోసి, నిప్పంటించింది.  మంటలేగిసిపడుతుండడంతో గమనించిన గ్రామస్తులు పరిగెత్తుకొచ్చి మంటలను ఆర్పేశారు. 

66

వెంటనే బాధితుడి కట్లు విప్పి అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు సమాచారం అందించారు. వివాహేతర సంబంధం కారణంగానే ఆమె ఇంత దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు.  నిందుతురాలైన భార్యని పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.

click me!

Recommended Stories