జైల్లో ఉన్న భర్తను చూసి.. గుండెపోటుతో గర్బిణి మృతి..

Published : Jun 09, 2023, 11:32 AM IST

బీహార్ లో ఓ గర్భిణి గుండెపోటుతో మృతి చెందడం విషాదాన్ని నింపింది. జైల్లో ఉన్న భర్తను చూడడానికి వెళ్లి, బయటికి వచ్చిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలి, మృతి చెందింది. 

PREV
16
జైల్లో ఉన్న భర్తను చూసి.. గుండెపోటుతో గర్బిణి మృతి..

బీహార్ : బీహార్లో హృదయవిధారక ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణి భర్తను చూడడానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందింది. హత్యాయత్నం కేసులో ఓ వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఆయనను చూడడానికి వెళ్లిన  గర్భిణీ  అయిన అతని భార్య గుండెపోటుతో మృతి చెందడం బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. 

26

మృతురాలు పేరు పల్లవి. ఆమెకు గోవింద్ యాదవ్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా, గోవింద్ యాదవ్ ఏడు నెలల నుంచి  ఓ హత్యాయత్నం కేసులో జైలులో ఉన్నాడు. అప్పటికే గర్భిణీగా ఉన్న పల్లవి దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. 

36

ప్రసవం సమయం దగ్గర పడుతుండడంతో.. ప్రసవానికి ముందు ఒకసారి భర్తను కలవాలనుకుంది. మంగళవారం నాడు జైలుకు వెళ్లింది. భర్తను చూసి కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకున్నారు.  అప్పటికే తీవ్ర మనస్థాపంతో ఉన్న పల్లవి భర్తను చూసిన తర్వాత మరింత భావోద్వేగానికి గురైంది. 

46

భర్తతో మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలబడిపోయింది. జైలు సిబ్బంది అది గమనించి, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

56
Tihar Jail

అయితే అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అక్కడికి వచ్చిన వారంతా ఈ విషయం తెలిసి.. కన్నీరు పెట్టారు. ఈ ఘటనతో వారి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. 

66

అయితే అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అక్కడికి వచ్చిన వారంతా ఈ విషయం తెలిసి.. కన్నీరు పెట్టారు. ఈ ఘటనతో వారి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. 

click me!

Recommended Stories