ఉత్తర ప్రదేశ్ : ప్రేమను నిరాకరిస్తే ప్రియురాలినో, ప్రియుడినో చంపడం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో.. తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని ప్రియురాలి తల్లిని దారుణంగా చంపేశాడు ఓ ప్రేమికుడు. తమ ప్రేమకు అడ్డు చెబుతోంది అన్న కోపంతో ప్రియురాలి తల్లిని ఓ యువకుడు పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపేశాడు. అయితే తల్లిని ఇలా చంపడం వెనక ఆమె మైనర్ కూతురు పాత్ర కూడా ఉందని ప్రాథమిక అంచనాలో పోలీసులు గమనించారు.