వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఇద్దరు అరెస్ట్..

Published : Aug 07, 2023, 01:47 PM IST

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తరువాత మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్. ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

PREV
17
వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఇద్దరు అరెస్ట్..

రాజస్థాన్‌ : రాజస్థాన్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. భరత్‌పూర్ జిల్లాలోని బన్సూర్ లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసింది. ఆ తరువాత మృతదేహాన్ని పారవేసింది. ఈ ఘటన వెలుగు చూడడంతో ఆమెను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

27

కానిస్టేబుల్ ఆమె ప్రియుడు కలిసి.. ఆమె భర్తను ఢిల్లీలో హత్య చేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రాజస్థాన్‌లో పాతిపెట్టారని పోలీసులు తెలిపారు.మృతుడు సంజయ్ జాట్. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన భార్య పూనమ్ జాట్‌తో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నాడు. 

37

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని బన్సూర్ గ్రామానికి చెందిన తోటి సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రామ్ ప్రతాప్‌తో ఆమెకు అక్రమ సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల క్రితం, పూనమ్ తన భర్త తనను శారీరకంగా వేధిస్తున్నాడని రామ్ ప్రతాప్‌ను ఢిల్లీకి రావాలని కోరింది. ఆ ప్రకారం అతను జూలై 31న ఢిల్లీకి చేరుకున్నాడు. 

47

ఇద్దరు కలిసి పూనమ్ భర్తను హత్య చేయాలని పథకం వేసి, అతన్ని హత్య చేశారు. హత్యానంతరం, రామ్ ప్రతాప్ సంజయ్ మృతదేహాన్ని తనతో పాటు తన స్వగ్రామమైన బన్సూర్‌కు తీసుకెళ్లాడు. తన ఇంటికి దగ్గర్లో ఉన్న ప్లాటులో పాతిపెట్టాడు.

57

కాగా, కొద్ది రోజులుగా సంజయ్ కనిపించకపోవడం.. ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితుడి బంధువులు రాజస్థాన్‌లోని ఖోహ్ పోలీస్ స్టేషన్‌లో అతని అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ ప్రారంభించిన పోలీసులు పూనమ్ జాట్‌తో పాటు ఇతరులను విస్తృతంగా ప్రశ్నించారు. ఇంటరాగేషన్ ఒత్తిడితో, ఆమె నేరాన్ని అంగీకరించింది. 

67

ఇంకాస్త గట్టిగా ప్రశ్నించేసరికి జరిగిన మొత్తం విషయాన్ని వివరించినట్లు ఖోహ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ గిర్రాజ్ ప్రసాద్ తెలిపారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా, పోలీసులు ఆగస్ట్ 4న రామ్ ప్రతాప్‌ను అతనింట్లోనే అరెస్టు చేశారు. సంజయ్ మృతదేహాన్ని ఎక్కడ, ఎలా పారవేసాడు అనే వివరాలను పోలీసులకు తెలిపాడు. 

77

దీంతో పోలీసులు సంజయ్ మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ఇద్దరు నిందితులు ప్రస్తుతం విచారణలో ఉన్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులను నిర్ధారించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

click me!

Recommended Stories