భగత్ కెరీర్ ఎలా మొదలైంది?: యానిమేషన్, డిజైనింగ్ పై ఎక్కువ ఆసక్తి ఉన్న దాదాసాహెబ్ భగత్ ఓ గ్రాఫిక్స్ కంపెనీలో పనిచేశాడు. అప్పుడు అతనికి మరింత పునర్వినియోగ టెంప్లేట్‌ల లైబ్రరీలో పని చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో డిజైన్ టెంప్లేట్‌లను విక్రయించడం ప్రారంభించాడు. అక్కడి నుంచే అతని ఆన్‌లైన్ వ్యాపారం మొదలైంది. వ్యాపారం ప్రారంభించే సమయంలో భగత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయినా అధైర్యపడకుండా బెడ్ మీద కూర్చుని డిజైన్ లైబ్రరీని విస్తరించాడు. 2015 నాటికి, అతని నిరంతర ప్రయత్నాల కారణంగా అతని Ninthmotion కంపెనీ ఉన్నతంగా నిలిచింది. ఇప్పుడు కంపెనీ BBC స్టూడియో, 9xm వంటి మ్యూజిక్ ఛానెల్‌లతో సహా దాదాపు 6000 మంది కస్టమర్‌లకు సేవలు అందిస్తోంది.
డూగ్రాఫిక్స్ పుట్టుక : నెలల తరబడి పరిశోధన మరియు అభివృద్ధి తర్వాత, భగత్ ఆన్‌లైన్ గ్రాఫిక్ డిజైనింగ్ కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది భగత్ రెండవ కంపెనీ డూగ్రాఫిక్స్ పుట్టుకకు దారితీసింది.