హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ - జ‌మ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి జోరు

First Published Oct 8, 2024, 4:25 PM IST

Election Results 2024 : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు 2024లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి జోరు చూపించింది. ఈ క్ర‌మంలోనే ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అవుతారని పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇక 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ మెజారిటీ మార్కును అధిగమించి రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి అధికారం పీఠం ఎక్క‌బోతోంది.
 

Congress, BJP,Assembly Election Results 2023

Election Results 2024 : ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌ను తలకిందులు చేస్తూ హర్యానాలో బీజేపీ మెజారిటీ మార్కును దాటింది. మూడో సారి అధికార పీఠంపై కూర్చోడానికి సిద్ధంగా ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి ఆధిక్యంలో ఉంది. దాదాపు అక్క‌డ ఈ కూట‌మి అధికారంలోకి రానుంద‌ని ఇప్ప‌టికే వెలువ‌డిన ఫ‌లితాలు స్పష్టం చేస్తున్నాయి. 

హ‌ర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యం 

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను త‌ల‌కిందులు చేస్తూ హ‌ర్యానాలో చారిత్రాత్మకంగా మూడోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్ప‌టికే స‌గానికి పైగా సీట్ల‌లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఓట్ల లెక్కింపు ఆరంభంలో కాంగ్రెస్ జోరు చూపించినా ఆ త‌ర్వాత బీజేపీ గాలిని అడ్డుకోలేక‌పోయింది. 

హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, అధికార పీఠం ద‌క్కించుకోవ‌డానికి 46 మ్యాజిక్ నంబర్‌గా ఉంది. ఇప్ప‌టికే బీజేపీ హ‌ర్యానాలో మ్యాజిక్ నెంబ‌ర్ ను దాటింది. ప్రస్తుత సమాచారం ప్రకారం హర్యానాలో బీజేపీ 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 35 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్ఎల్డీపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

1966 నుంచి హర్యానాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఏ పార్టీ కూడా వరుసగా మూడోసారి గెలవలేదు. హర్యానాలో ఒకప్పుడు పవర్‌హౌస్‌గా ఉన్న ఓం ప్రకాష్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD), దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (JJP)లు అంత ప్రభావం చూపించలేకపోయాయి. 

Latest Videos


ನ್ಯಾಷನಲ್ ಕಾನ್ಫೆರನ್ಸ್ ಅಧ್ಯಕ್ಷ ಫಾರೂಕ್ ಅಬ್ದುಲ್ಲಾಗೆ ಸಂಕಷ್ಟದ ಮೇಲೆ ಸಂಕಷ್ಟ ಎದುರಾಗಿದೆ. ರೋಶನಿ ಭೂ ಹಗರಣದಲ್ಲಿ ಸಿಲುಕಿರುವ ಫಾರೂಖ್ ಅಬ್ದುಲ್ಲಾ ಇದೀಗ ಮನಿಲಾಂಡರಿಂಗ್ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಸಿಲುಕಿದ್ದಾರೆ.

జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమిదే అధికారం 

దశాబ్ద కాలంలో తొలిసారిగా 90 మంది సభ్యుల అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ఈ కూటమి 49 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 29 స్థానాలను కైవసం చేసుకునే విధంగా ముందుకు సాగుతోంది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)3 స్థానాల్లో, ఇతరులు 9 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 

బుద్గామ్, గందర్‌బల్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎన్‌సీ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. "మమ్మల్ని నాశనం చేయాలని కోరిన వారే నేడు ప్రజా తీర్పుతో పత్తాలేకుండా పోయారంటూ కామెంట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రశ్నించగా.. ఫలితాలు పూర్తిగా వెలువడే వరకు ఆగాలని చెప్పారు. కాగా, జమ్మూ కాశ్మీర్ 2014 తర్వాత మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసింది. మొదట కేంద్ర పాలిత ప్రాంతంగా ఆర్టికల్ 370 తొలగించబడిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చింది. 

Jammu and Kashmir

జమ్మూ ప్రాంతంలో బీజేపీ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినా కాశ్మీర్ లోయలో మాత్రం ఘోర ప్రదర్శన కనబరిచింది. శాంతి, అభివృద్ధి, శ్రేయస్సుపై దృష్టి సారించి ఈ ప్రాంతాన్ని 'నయా కాశ్మీర్'గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. వాగ్దానాలతో చేసిన మార్పు ఈ ప్రాంతంలోని కాషాయ పార్టీకి ఓట్లుగా మారలేదు.

హర్యానాలోని జులనాలో కాంగ్రెస్ అభ్యర్థి, రెజ్లర్ వినేష్ ఫోగట్ తన తొలి ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఒలింపిక్ స్టార్ 64,548 ఓట్లను సాధించి, తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన యోగేష్ కుమార్‌పై 6,553 ఓట్లతో విజయం సాధించారు. పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతున్న క్రమంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వినేష్ ఫోగట్‌ను కాంగ్రెస్ జులనాలో బరిలోకి దింపింది.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రమైన హర్యానాలో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే, జమ్మూ కాశ్మీర్‌లోని దోడా అసెంబ్లీ స్థానానికి ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ రేసులో ముందంజలో ఉన్నారు. జాతీయ భారత కూటమిలో దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో పార్టీ సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని పొందలేకపోయినందున హర్యానాలో ఆప్ పై ప్రభావం కనిపించింది. 

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌సీ-కాంగ్రెస్ మ్యాజిక్ నెంబర్ దాటడంతో శ్రీనగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు దాదాపుగా ఫలితాలు వెలువడ్డాయి. ఒమర్ కొత్త సీఎం అని ఫరూక్ అబ్దుల్లా స్పష్టంగా ప్రకటించారు. ఆర్టికల్ 370 రద్దును ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు ఎన్నికల్లో పాల్గొని స్వేచ్ఛగా ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు ఎన్నికైన ప్రభుత్వం చాలా కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు.

నిరుద్యోగాన్ని అంతం చేయాలనీ, ద్రవ్యోల్బణం, మాదక ద్రవ్యాల సమస్య వంటి సమస్యలను ఎదుర్కోవాలని ఫరూక్ అన్నారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్, అతని సలహాదారులు ఉండరు. ఇప్పుడు ప్రజల కోసం పని చేసే ఎమ్మెల్యేలు 90 మంది ఉంటారు. ప్రస్తుతం ఫరూక్ ప్రసంగం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

click me!