మహిళల లైంగిక కోరికలు తీర్చే రోబోలు ... 2025 నాటికి జరిగేదిదేనట

First Published | Oct 8, 2024, 12:29 PM IST

సాంకేతికత పరిజ్ఞానం మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చింది. అయితే ఈ టెకీ జమానాలో మానవ సంబంధాలు కూడా మారిపోయే ప్రమాదం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లైంగిక సంబంధాల్లో కూడా టెక్నాలజీ ఎంటర్ కానుందని అంటున్నారు.

Robot

రాబోయే కాలంలో మానవ సంబంధాలు కొత్తపుంతలు తొక్కనున్నాయని కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి ఆసక్తికర కథనాన్నే బ్రిటిష్ వార్తాసంస్థ ది సన్ వెల్లడించింది. 2025 నాటికి రొబోటిక్ సెక్స్  ధనవంతుల మహిళలకు బాగా దగ్గర కానుందని తెలిపింది. ఇలా పురుషులతో కాకుండా రోబోట్స్ తో లైంగిక కోరికలు తీర్చుకునే సంస్కృతి రాబోయే పదేళ్లలో మరింత పెరిగిపోతుందని ఫ్యుటురోలజిస్ట్ డా. ఇయాన్ పియర్సన్ అభిప్రాయపడ్డారు. 

Robot

ఇప్పటికే  మహిళలు పురుషుల కంటే రోబోలనే ఎక్కువగా ఇష్టపడే సంస్కృతి మొదలయ్యిందని డా. ఇయాన్ వెల్లడించారు. అయితే ఈ వాదనతో ఎక్కువమంది ఏకీభవించకపోవచ్చు. కానీ ప్రస్తుతం సెక్స్ టాయ్స్ వంటి వాటికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోలు కూడా ఇందులో భాగం అవుతాయనే మరో వాదన కూడా వుంది. మొత్తంగా లైంగిక వ్యవహారాల్లో రోబోల ఎంట్రీ పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం కాదు.  


robot

డా. పియర్సన్ అభిప్రాయం ప్రకారం...  ఒకప్పుడు లైంగిక విషయాల గురించి మాట్లాడేవారు కాదు. కానీ నేడు ఆ విషయాల గురించి చాలా సహజంగా మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో లైంగిక సంబంధమైన టాయ్స్, వైబ్రేటర్లు విరివిగా వినియోగంలో వచ్చాయని తెలిపారు. కాబట్టి భవిష్యత్ లో లైంగిక వ్యవహారాల కోసం రోబోలను ఉపయోగించడం కూడా సర్వసాధారణం కానుందని తెలిపారు. 

Robot

2050 నాటికి సాధారణంగా లైంగిక కోరిక తీర్చుకోవడం కంటే రోబోలను ఉపయోగించడానికే ఎక్కువమంది ఇష్టపడతారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం లైంగిక కోరికల కోసం రోబోల వినియోగించడం ఊహించడానికి వింతగా వుంది... కానీ ఇదే పోనుపోను సాధారణంగా మారుతుందని డా. పియర్సన్ తో పాటు ఇతర నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలా లైంగిక వ్యవహారాల్లో రోబోల వినియోగం పెరిగితే వాటితో ఎమోషనల్ బాండ్ కూడా పెరిగే అవకాశాలున్నాయి... తద్వారా సిగ్గు, బిడియం తగ్గి చాలా కామన్ గా లైంగిక కోరికలు  తీర్చుకునే పరిస్థితి వుంటుందన్నారు. 

Latest Videos

click me!