జకీర్ నాయక్ వ్యాఖ్యలపై దుమారం :
మహిళలు, వివాహ వ్యవస్థపై జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి... అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యధిక శాతం నెటిజన్లు నాయక్ వ్యాఖ్యల స్త్రీలపై ఆయనకున్న ద్వేషాన్ని తెలియజేస్తాయని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మహిళల హక్కులకు హానికరమైనవిగా పేర్కొంటున్నారు. మరికొందరు పాకిస్తాన్ ఇలాంటి ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు.
ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తిని వివాహం చేసుకోకపోతే పెళ్లికాని స్త్రీని గౌరవించలేదని జకీర్ నాయక్ అంటున్నాడు. లేదంటే ఆమె బజారు మనిషిగా మారుతుందని అంటున్నాడు.. ఇది మధ్యయుగ ఆలోచనా విధానం. ఇలాంటి వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమైనవి, భయంకరమైనవి. ఇలాంటి వ్యాఖ్యలను పాకిస్థాన్ సమర్దించడం దారుణమని నెటిజన్లు అంటున్నారు.
ఈ వివిదాస్పద చర్చలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా ప్రస్తావించబడింది. జాకీర్ నాయక్ భారతదేశంలో అలాంటి అభిప్రాయాలను వ్యాప్తి చేయకుండా చూసుకున్నందుకు చాలా మంది ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం ఎప్పటికీ జకీర్ నాయక్ నుదేశానికి తిరిగి రాకుండా నిషేధించాలని నెటిజన్లు కోరుతున్నారు.