ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎఫెక్ట్: సోనియాతో మాయావతి భేటీకి బ్రేక్

First Published May 20, 2019, 11:13 AM IST

న్యూఢిల్లీ: యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో బిఎస్పీ అధినేత మాయావతి భేటీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మాయావతి సోమవారం ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీతో సమావేశం కావాల్సి ఉండింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం మాయావతి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అకస్మాత్తుగా మాయావతి ఢిల్లీ పర్యటన రద్దయింది

undefined
మాయావతి ఢిల్లీ వెళ్లే కార్యక్రమమేదీ లేదని, ఆమె లక్నోలోనే ఉంటారని మాయావతి సన్నిహితుడు సతీష్ చంద్ర మిశ్రా చెప్పారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చాయి.
undefined
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీకి, మాయావతికి మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు, దాంతో మాయావతి ఢిల్లీ వస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు లక్నో వెళ్లి మాయావతిని కలవడంతో పాటు రాహుల్ గాంధీతో రెండుసార్లు సమావేశమయ్యారు
undefined
ఆదివారంనాడు సోనియాను, రాహుల్ గాంధీని కలిసిన చంద్రబాబు నాయుడు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీని కలిసే అవకాశం ఉంది. అయితే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీఎకు మెజారిటీ వస్తుందని తేల్చడంతో మాయావతి సోనియాను కలవడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు.
undefined
click me!