దేవుడిదే భారం: కేదార్ నాథ్‌కు మోదీ, సోమనాథ్‌కు అమిత్ షా... తిరుపతిలో దేవెగౌడ, కుమార స్వామి

First Published May 18, 2019, 11:03 AM IST

లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. దీంతో  ఇన్నాళ్లు ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నించిన నాయకులు ఇప్పుడు దేవాలయాల బాట పట్టారు. 
 

దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ప్రచారానికి నిన్నటితో ప్రచారం ముగిసింది. చివరి దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 19న జరగనుండటంతో 48 గంటల ముందు అంటే శుక్రవారం తో ప్రచారానికి తెరపడింది. దీంతో ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన నాయకులంతా ఇప్పుడు భక్తిమార్గం పట్టారు. ఎన్నికల్లో తమ పార్టీకే విజయం కట్టబెట్టాలంటూ ఆ దేవున్ని వేడుకునేందుకే రాజకీయ నాయకలు భక్తిమార్గం పట్టారు.
undefined
కేదార్ నాథ్ లో ప్రధాని మోదీ; భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉత్తరా ఖండ్ లో కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక విమానంలో డిల్లీ నుండి నేరుగా కేదార్ నాథ్ కు చేరుకున్న ఆయన దైవదర్శనం చేసుకున్నారు. బిజెపి పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ మోదీ ఈ పర్యటన చేపట్టినట్లు బిజెపి నాయకులు చెబుతున్నారు.
undefined
సోమనాథ్ ఆలయానికి అమిత్ షా: బిజెపి జాతీయాధ్యక్షులు అమిత్ షా కూడా శనివారం గుజరాత్ లోని ప్రముఖ హిందూ దేవాలయం సోమనాథ్ ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. స్వయంగా ఎంపీగా ఫోటీ చేస్తున్న అమిత్ షా తన గెలుపుతో పాటు పార్టీ గెలుపు కోసం సోమనాథున్ని దర్శించుకుంటున్నట్లు సమాచారం.
undefined
తిరుమలలో మాజీ ప్రధాని, జేడియు అధినేత దేవెగౌడ...కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి: కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ప్రచారంతో జేడియు-కాంగ్రెస్ మిత్రపక్షాల అభ్యర్థుల తరపున ప్రచారం చేపడుతూ బిజీబిజీగా గడిపిన మాజీ ప్రధాని, జేడియు అధినేత దేవె గౌడ శుక్రవారం తిరుమలలో కనిపించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా రెండు ప్రత్యేక విమానాల్లో తిరుమలకు చేరుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి కూడా వున్నారు. వీరిద్దరు కూడా కర్ణాటకలో జేడియు-కాంగ్రెస్ మిత్రపక్షానికి అత్యధిక సీట్లు వచ్చేలా కరుణించాలని ఆ దేవదేవున్ని కోరుకున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు..
undefined
click me!