విమానంలో కొబ్బరి తీసుకెళ్లకూడదు... ఎందుకో తెలుసా..?

First Published | Aug 7, 2024, 6:00 PM IST

విమానంలో అక్రమంగా బంగారం, డ్రగ్స్ వంటివి  తరలించడం అతిపెద్ద నేేరం. ఈ విషయం అందరికీ తెలిసిందే.  కానీ విమానంలో కొబ్బరిని కూడా తరలించడం నేరమే అన్నది ఎంతమందికి తెలుసు..?  ఇందుకు కారణమేంటో తెలుసాా,..? 

flight journey

సుదూర ప్రాంతాలకు వేగంగా చేరుకోవాలంటే విమానంలో ప్రయాణించాల్సిందే. విదేశాలకే కాదు దేశీయంగాను కొన్ని నగరాల మధ్య విమాన సర్వీసులు అందుబాటులో వున్నాయి. అయితే విమానంలో ప్రయాణానికి కొన్ని నియమనిబంధనలు వున్నాయి... వాటిగురించి తెలుసుకుంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది. 

విమాన ప్రయాణంలో మన లగేజీని వెంట తీసుకెళ్లనివ్వరు. విమానాశ్రయంలో మన లగేజీని విమానయాన సిబ్బందికి అప్పగించాల్సి వుంటుంది. గమ్యానికి చేరుకున్న తర్వాత లగేజీని తిరిగి అప్పగిస్తారు. అయితే మనకు అవసరమైన కొన్ని వస్తువులను మాత్రం వెంట తీసుకెళ్లవచ్చు. కానీ ఇందులో కొన్ని వస్తువులు అస్సలు వుండకూడదు. అలాంటివారిలో ఎండు కొబ్బరి కూడా ఒకటి.  
 

flight journey

విమానాల్లో కొబ్బరిని ఎందుకు అనుమతించరు?  

విమానయాన సంస్థలు ప్రయాణీకులు భద్రతను దృష్టిలో వుంచుకుని కొన్ని వస్తువులను విమానంలోకి అనుమతించారు. ముఖ్యంగా మండే స్వభావమున్న సిగరెట్లు, లైటర్లతో పాటు గన్నులు, కత్తులను అనుమతించరు. అలాగే పెట్రోల్, డీజిల్, యాసిడ్ వంటివాటిని కూడా అనుమతించరు. 

Latest Videos


flight journey

ఆశ్చర్యకరంగా ఎండు కొబ్బరిని కూడా విమానంలోకి అనుమతించరు.  ఎందుకంటే కొబ్బరిలో నూనె శాతం వుంటుంది...  ఇది మండే స్వభావాన్ని కలిగివుంటుంది. అందువల్లే కొబ్బరిని కూడా నిషేదిత జాబితాలో చేర్చారు. 

flight journey

కాబట్టి విమానంలో ప్రయాణానికి ముందు ఏఏ వస్తువులను తీసుకెళ్లవచ్చు... వేటిని తీసుకెళ్లకూడదో తెలుసుకుంటే మంచిది. డ్రగ్స్, కొన్ని అరుదైన ప్రాణులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే వస్తువులనే కాదు ప్రమాదకర భావించి కొబ్బరి వంటివాటిని కూడా విమానంలోకి అనుమతించరు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. 

flight journey

ఇక మరికొన్ని వస్తువులను అనుమతితో తీసుకెళ్ళాలి. ఇలా బంగారం, మొక్కలు, రసాయనాలు, బుక్స్, ప్రత్యేక మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి కూడా అనుమతి లేకుండా వెంటతీసుకెళ్లడం నేరమే. కొంత డబ్బు చెల్లించి, తగిన అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. 
 

flight journey

విమాన ప్రయాణం సాఫీగా సాగాలంటే ముందుగానే ఈ విషయాలన్ని తెలుసుకుంటే మంచింది.లేదంటే ప్రయాణ సమయంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది. విమానయాన సంస్థల అధికారిక వెబ్ సైట్, కేంద్ర విమానయాన శాఖ అధికారులను సంప్రదించి విమానంలో నిషేదిత వస్తువులేవో తెలుసుకోవచ్చు.  

click me!