న్యాయం కోసం పోరాటం
నిర్భయ, కథువా ఘటనలు మరిచిపోకముందే కోల్ కతా డాక్టర్ పై హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలా దేశంలో అత్యాచార ఘటనలు వెలుగుచూసిన ప్రతిసారీ ప్రతిసారీ న్యాయంకోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే కేవలం భారత్ మాత్రమే కాదు ప్రపంచంలోని అనేక దేశాలు మహిళలపై అత్యాచారం, వేధింపులు ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచంలోని చాలా దేశాల్లో దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది.
భారత్ లో
భారతదేశంలో అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షపడేరేటు కేవలం 27%-28% శాతంగా వుంది. (2018-2022 వరకు ఎన్సిఆర్బి లెక్కల ప్రకారం)
ఇంగ్లాండ్ లోనూ దారుణం
భారత్ లోనే కాదు ఇంగ్లాండ్‌లో కూడా అత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది. 2022 నాటి గణాంకాల ప్రకారం, అత్యాచారానికి పాల్పడిన వారికి శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది. యుకెలో నమోదైన కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు దాదాపు 1.3%గా ఉంది. అయితే కోర్టుకు వెళ్లే కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు దాదాపు 65%గా ఉంది.
అమెరికాలో పరిస్థితి
అమెరికాలో కోర్టుకు చేరుకున్న అత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు దాదాపు 57 శాతం. అయితే చాలా కేసులు కోర్టుకు చేరవని భావిస్తున్నారు.
స్వీడన్ లోనూ సమస్యే
యూరోపియన్ దేశమైన స్వీడన్‌లో అత్యాచార కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇక్కడ అత్యాచారాల నివేదిక రేటు అత్యధికంగా ఉంది, అయినప్పటికీ దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది, దాదాపు 12 శాతం నిందితులకే ఇక్కడ శిక్షలు పడుతున్నాయని నిపుణుల అభిప్రాయం.
జర్మనీలోనూ ఇదే పరిస్థితి
జర్మనీలో కూడా అత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష పడే రేటు చాలా తక్కువగా ఉంది, దాదాపు 8-10 శాతం మాత్నమే నిందితులకు శిక్ష పడుతోంది. ఇక్కడ కూడా బాధితులు సామాజిక నిందకు భయపడుతున్నారు.