Cylinder price: దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ల‌ స‌మ‌స్య.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న రిల‌య‌న్స్‌

Published : Mar 11, 2026, 10:02 AM IST

Cylinder price: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన భద్రత అత్యంత కీలక అంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఇంధన సరఫరా అంతరాయం లేకుండా కొనసాగేందుకు రిల‌య‌న్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

PREV
15
ఇరాన్ యుద్ధ ప్రభావం… ప్రపంచ ఇంధన మార్కెట్లలో అస్థిరత

మధ్యప్రాచ్య ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాలో కీలక కేంద్రంగా ఉంటుంది. ముఖ్యంగా గ‌ల్ఫ్ ప్రాంతం ద్వారా భారీ స్థాయిలో క్రూడ్ ఆయిల్ రవాణా జరుగుతుంది. ప్రస్తుతం ఇరాన్‌తో సంబంధం ఉన్న యుద్ధ పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మారుమూలంగా మారుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకునే దేశం కావడంతో ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

25
జామ్‌నగర్ రిఫైనరీలో ఎల్పీజీ ఉత్పత్తి పెంపు

ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది. గుజరాత్‌లోని జామ్‌న‌గ‌ర్ వద్ద ఉన్న కంపెనీ సమగ్ర రిఫైనింగ్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ సముదాయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రిఫైనింగ్, పెట్రోకెమికల్ యూనిట్లలో ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి తీసుకెళ్లేలా కంపెనీ సాంకేతిక బృందాలు పని చేస్తున్నాయి. దేశీయ మార్కెట్‌కు సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు రిఫైనరీ కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహిస్తున్నారు.

35
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇంధన నిర్వహణ

ప్రపంచ మార్కెట్లలో ఏర్పడే అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంధన సంస్థలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం, కీలక రంగాలకు సరఫరా నిరంతరం కొనసాగించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మార్గదర్శకాల మేరకు రిలయన్స్ సంస్థ ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేస్తోంది.

45
కేజీ-డి6 బేసిన్ నుంచి సహజ వాయువు సరఫరా

ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉన్న కృష్ణా గోదావ‌రి బేసిన్‌లోని KG-D6 Block నుంచి ఉత్పత్తి అయ్యే సహజ వాయువును కూడా దేశీయ అవసరాలకు అనుగుణంగా మళ్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జాతీయ ఇంధన ప్రాధాన్యం ప్రకారం విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ వంటి కీలక రంగాలకు ఈ గ్యాస్ సరఫరా చేస్తారు. దీని వల్ల దేశంలో కీలక పరిశ్రమల కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగుతాయి.

55
భారత ఇంధన భద్రతపై రిలయన్స్

భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నట్లు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ తెలిపింది. కోట్లాది భారతీయ కుటుంబాలకు అవసరమైన ఇంధనాలు సమయానికి అందేలా ప్రభుత్వం‌తో సమన్వయంతో పనిచేస్తామని సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేశానికి అవసరమైన సమయంలో తాము ఎప్పుడూ ముందుంటామని రిలయన్స్ పేర్కొంది. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూడా కంపెనీ తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories