14యేళ్ల బాలుడిని సజీవంగా తినేసిన మొసలి.. గంగాజలం కోసం వెడితే...

Published : Jun 14, 2023, 10:07 AM IST

గంగానదిలో స్నానం చేయడానికి వెళ్లిన ఓ 14యేళ్ల బాలుడిని మొసలి తినేసింది. బాలుడు కుటుంబంతో కలిసి గంగనీళ్లు తీసుకురావడానికి నదికి వచ్చాడు. 

PREV
16
14యేళ్ల బాలుడిని సజీవంగా తినేసిన మొసలి.. గంగాజలం కోసం వెడితే...

పాట్నా : బీహార్ లోని పాట్నాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ 14యేళ్ల బాలుడిని మొసలి దాడి చేసి.. సజీవంగా నమిలి తిసేసింది. వారి కుటుంబం కొత్త మోటార్‌సైకిల్‌ కొనుగోలు చేసింది. ఆ బండిని గంగాజలంతో పూజిద్దామని గంగనీళ్ల కోసం నదికి వెళ్లారు. కుటుంబంతో పాటు నదిలో ఆ 14 ఏళ్ల బాలుడు స్నానం చేసేందుకు గంగలోకి వెళ్లాడు. 

26

అతని మీద ఓ మొసలి దాడి చేసి.. చంపేసింది. అది చూసిన కుటుంబసభ్యులు తీవ్రంగా కంటతడి పెట్టారు. ఈ మొసలిని బాలుడి బంధువులు, ఇతర గ్రామస్తులు కర్రలు, రాడ్‌లతో దారుణంగా కొట్టి చంపారు.

36

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. బీహార్‌లోని వైశాలి జిల్లాలోని రాఘోపూర్ దియారాకు చెందిన 5వ తరగతి విద్యార్థి అంకిత్ కుమార్ కుటుంబం కొత్త మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి, గంగలో స్నానం చేయాలని నిర్ణయించుకుంది. బైక్‌కు పూజ నిర్వహించడానికి గంగాజల్‌ను తీసుకురావాలనుకుంది. 

46

దీనికోసం కుటుంబం గంగానదికి వెళ్లింది. నదిలో స్నానం చేస్తుండగా, మొసలి అంకిత్‌పై దాడి చేసి, నీళ్లలోకి లాక్కెళ్లింది. ఆ తరువాత అతడిని సజీవంగానే.. ముక్కలుగా ముక్కులుగా కొరికి తినేసింది.

56

ఈ దాడి జరిగిన గంట తర్వాత కుటుంబం అంకిత్ అవశేషాలను గంగ ఒడ్డున బయటకు తీశారు. ఈ సమయంలో నది ఒడ్డున జనం గుమిగూడారు. కుటుంబం, గుమిగూడి గుంపు తీవ్ర ఆగ్రహంతో నీటిలో నుండి మొసలిని బయటకు లాగారు. దాన్ని కర్రలు, రాడ్ లతో కొట్టి చంపారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. మొసలి చనిపోయిన తరువాత కానీ వారు శాంతించలేదు.  

66

అంకిత్ తాత సకల్దీప్ దాస్ మాట్లాడుతూ, "మేము కొత్త మోటార్‌సైకిల్ కొన్నాం. దాన్ని గంగనీళ్లతో పూజిద్దామనుకున్నాం. దీనికోసం గంగలో స్నానం చేసి గంగాజల్‌ని పూజ కోసం తీసుకెళ్ళాలని నదిలోకి దిగాం. ఒక మొసలి అతన్ని పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది. అంకిత్ అవశేషాలను బయటకు తీయగలిగాం. గంట తర్వాత మొసలిని కూడా బయటకు లాగి చంపారు" అని చెప్పారు. 

click me!

Recommended Stories