
Tamilnadu Assembly Elections Result 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. ఈ ఎన్నికల్లో టీవీకే 10-20 సీట్లు గెలవడమే కష్టమన్నారు... సర్వేలు కూడా అదే చెప్పాయి. కానీ నిన్న (సోమవారం, మే 4న) వచ్చిన ఫలితాలు అన్ని అంచనాలను తలకిందులయ్యాయి... టీవీకే ఏకంగా 108 స్థానాల్లో గెలిచి ఏకంగా ప్రభుత్వం ఏర్పాటుకే సిద్ధమవుతోంది. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే 34.95 శాతం ఓట్లు సాధించి టీవీకే రికార్డు సృష్టించింది. ఈ ఎన్నికల్లో ఎన్నో ఆసక్తికర ఘటనలు జరిగాయి. అందులో ఒకటి టీవీకే అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలవడం.
శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) తరఫున పోటీ చేసిన శ్రీనివాస సేతుపతి, డీఎంకే మంత్రి కే.ఆర్.పెరియకరుప్పన్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మొత్తం 30 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జరిగింది... చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరకు టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి ఒక్క ఓటు తేడాతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఈయనది కదా అదృష్టమంటే.. ఒక్క ఓటుతో ఎమ్మెల్యే అయ్యాడు.
తిరుపత్తూరు డీఎంకేకు కంచుకోట. అక్కడ డీఎంకే 8 సార్లు గెలిచింది. 2006 నుంచి వరుసగా 4 సార్లు గెలుస్తూ వస్తున్న పెరియకరుప్పన్‌ను ఈసారి టీవీకే అభ్యర్థి ఓడించారు. శ్రీనివాస సేతుపతి (TVK) కి 83375 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి (DMK) పెరియకరుప్పన్ కు 83374 ఓట్లు వచ్చాయి. ఆసక్తికరంగా ఈ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి తికెమరన్ కు 29054 ఓట్లు వచ్చాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరికొన్ని నియోజకవర్గాల్లోనూ టఫ్ పైట్ సాగింది. దీంతో అతితక్కువ మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించారు. ఇలాంటి అసెంబ్లీ స్థానాలు ఏవంటే...
1. పోలూరు అసెంబ్లీ
తిరువణ్ణామలై జిల్లా పోలూరులో తక్కువ ఓట్లతో విజయం TVK విజయం సాధించింది. ఈ పార్టీ పోటీలో నిలిపిన అభ్యర్థి అభిషేక్ 227 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.. ఇతడికి 67,961 ఓట్లు రాగా DMDK కు 67,734 ఓట్లు వచ్చాయి.
2. వెప్పనహల్లి అసెంబ్లీ
క్రిష్ణగిరి జిల్లాలోని వెప్పనహల్లిలో DMK అభ్యర్థి శ్రీనివాసన్ 138 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ డిఎంకేకు 74,691 ఓట్లు పోలవగా AIADMK అభ్యర్థి మునుస్వామికి 74,553 ఓట్ల వచ్చాయి. ఈ అసెంబ్లీలో టివికె అభ్యర్థి సంపంగికి 63907 ఓట్లు వచ్చాయి.
3. కన్యాకుమారి అసెంబ్లీ
కన్యాకుమారిలో AIDMK అభ్యర్థి తలవై సుందరం కేవలం 214 ఓట్లతో విజయం సాధించాడు. ఇతడికి 75045 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి (DMK అభ్యర్థి) మహేష్ కు 74831 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టివికే అభ్యర్థి మాధవన్ కు 72977 ఓట్లు వచ్చాయి
4. తిరుక్కోయిలూరు అసెంబ్లీ
విళుపురం జిల్లీ తిరుక్కోయిలూరులో AIDMK అభ్యర్థి పళనిస్వామి 285 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఇతడికి 73033 ఓట్లు రాగా TVK అభ్యర్థి విజయ్ ఆర్ భరణిబాలాజీకి 72748 ఓట్లు వచ్చాయి.ఇక్కడ డిఎంకే అభ్యర్థి పోన్ గౌతమ్ సింగమని 62452 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
తొలి ఎన్నికల్లోనే చారిత్రక విజయాన్ని అందుకుంది టివికే. ఈ పార్టీ అధినేత విజయ్ కూడా పొటీచేసిన రెండు స్థానాల్లో విజయం సాధించాడు పెరంబూర్ నియోజకవర్గంలో 53,715 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక తిరుచ్చి (తూర్పు) నియోజకవర్గంలోనూ 27416 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
ఇక తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే 108 చోట్ల గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు అవసరం కాగా 10 సీట్ల దూరంలో నిలిచింది. ఇతర పార్టీల సపోర్ట్ విజయ్‌కు లభించే అవకాశం ఉంది... దీంతో సొంతంగానే ఆయన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేలా కనిపిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో అధికార డీఎంకేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఓడిపోవడం కాదు స్వయంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన కంచుకోట కొళత్తూరు నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. ఇక్కడ టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ 7140 స్వల్ప మెజారిటీతో విజయం సాధించాడు... దీంతో ఈయననే శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి.