Cigarette Price: పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసిందే. అయినా పొగరాయుళ్లు మాత్రం ఈ అలవాటును మానుకోరు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పొగరాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది.
కొత్త ఏడాది మొదలవుతూనే పొగతాగేవారికి ఊహించని షాక్ తగలనుంది. ఇప్పటివరకు అలవాటుగా మారిన సిగరెట్ ఇకపై ఖరీదైన అలవాటుగా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం 1 ఫిబ్రవరి 2026 నుంచి సిగరెట్ ధరలు గణనీయంగా పెరగనున్నాయి.
25
ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
సిగరెట్, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. పొగాకు వినియోగం వల్ల వచ్చే వ్యాధుల చికిత్సపై ఆరోగ్య రంగంపై భారం పెరుగుతుండటమే ప్రధాన కారణంగా ప్రభుత్వం చెబుతోంది. అదనంగా పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేసేందుకు ట్యాక్స్ విధానంలో మార్పులు అవసరమయ్యాయని పేర్కొంది.
35
కొత్త ఎక్సైజ్ డ్యూటీ విధానం ఎలా ఉంటుంది?
కొత్త విధానంలో సిగరెట్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నారు. ఇది ఇప్పటికే అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీకి అదనంగా ఉంటుంది. సిగరెట్ పొడవును బట్టి ప్రతి 1000 సిగరెట్లపై రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఎక్సైజ్ డ్యూటీ నిర్ణయించారు. అంటే సిగరెట్ పొడవు పెరిగే కొద్దీ పన్ను భారం కూడా పెరుగుతుంది.
65 మిల్లీమీటర్ల వరకు ఉండే చిన్న నాన్-ఫిల్టర్ సిగరెట్‌పై ఒక్క స్టిక్‌కు సుమారు రూ.2.05 అదనపు పన్ను పడుతుంది. అదే పొడవులో ఉన్న ఫిల్టర్ సిగరెట్‌పై సుమారు రూ.2.10 పెరుగుతుంది. 65 నుంచి 70 మిల్లీమీటర్ల సిగరెట్లపై ఒక్క స్టిక్‌కు రూ.3.60 నుంచి రూ.4 వరకు భారం పడనుంది. 70 నుంచి 75 మిల్లీమీటర్ల ప్రీమియం సిగరెట్‌పై సుమారు రూ.5.40 అదనపు పన్ను విధిస్తారు. ప్రత్యేక డిజైన్ సిగరెట్లపై గరిష్ఠంగా రూ.8.50 వరకు పన్ను ఉంటుంది.
55
రూ.20 సిగరెట్ ఇప్పుడు ఎంత అవుతుంది?
ప్రస్తుతం రూ.20కు లభిస్తున్న సిగరెట్ 65 మిల్లీమీటర్ల ఫిల్టర్ కేటగిరీలో ఉంటే దానిపై కనీసం రూ.2కు పైగా అదనపు పన్ను చేరుతుంది. దీనికి డీలర్ మార్జిన్, ఇతర ఖర్చులు కలిస్తే ఆ సిగరెట్ ధర రూ.22 నుంచి రూ.23 వరకు చేరే అవకాశం ఉంది. ప్రీమియం సిగరెట్ ధరలు భారీగా పెరగనున్నాయి.