హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును మార్చింది ఏపీ ప్రభుత్వం. హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరును మార్చడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు.ఈ విషయమై అసెంబ్లీ లోపల, బయట కూడా టీడీపీ ఆందోళనకు దిగింది. మరో వైపు హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్చడాన్ని వైసీపీ సమర్ధించుకుంది. వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినందుకు గాను హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరును పెట్టాలని నిర్ణయం తీసుకొన్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.