యూపీలో విచిత్రం: భార్య కొడుతుందని నెల రోజులుగా చెట్టుపైనే నివాసం

Published : Aug 29, 2022, 05:28 PM IST

నెల రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లోని  మౌ జిల్లాకు చెందిన రామ్ ప్రవేశ్ అనే వ్యక్తి  కొబ్బరి చెట్టుపైనే నివాసం ఉంటున్నాడు. భార్య కొడుతుందని ఆయన చెట్టు దిగడం లేదు.గ్రామస్తులు కోరినా కూడా ఆయన వినడం లేదు. 

PREV
 యూపీలో విచిత్రం: భార్య కొడుతుందని నెల రోజులుగా చెట్టుపైనే  నివాసం
cartoon punch

భార్య కొడుతుందని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  42 ఏళ్ల రామ్ ప్రవేశ్ చెట్టు పైనే నెల రోజులుగా ఉంటున్నాడు. రామ్ ప్రకాష్ , ఆయన భార్య పెళ్లైన కొత్తలో అన్యోన్యంగానే ఉండేవారు. అయితే ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ గొడవలు జరిగే సమయంలో ఒక రోజు భర్తపై  భార్య చేయి చేసుకొంది. అయితే వీరి మధ్య గొడవలు జరిగిన సమయంలో భర్తపై భార్య కొట్టడం ప్రారంభించింది. అయితే ఇటీవల కాలంలో భార్య కొట్టే దెబ్బలు మరింత తీవ్రంగా ఉండడంతో తట్టుకోలేక చెట్టుపైనే రామ్ ప్రవేశ్ నివాసం ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

తన ఇంటికి సమీపంలోనే ఉన్న వంద అడుగుల కొబ్బరి చెట్టుపైనే నెల రోజులుగా ఆయన ఉంటున్నారు. భార్య  నిద్ర పోయిన సమయంలో కిందకు దిగి ఆయన అన్నం తిని మళ్లీ చెట్టు ఎక్కుతున్నాడు. గ్రామస్తులు,  కుటుంబ సభ్యులు కోరినా కూడా ఆయన చెట్టు దిగడం లేదు.  దీంతో చెట్టు వద్దే అన్నం, నీళ్లను కుటుంబ సభ్యులు పెడుతున్నారు. రోజులో ఏదో ఒక సమయంలో చెట్టు దిగి అన్నం తిని ఆయన మళ్లీ చెట్టు ఎక్కుతున్నాడు.  చెట్టు దిగాలని గ్రామస్తులు కోరినా కూడా ఆయన చెట్టు దిగడం లేదు.


 

click me!

Recommended Stories