దక్షిణ కన్నడ జిల్లాలో పుత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున అశోక్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నారు.అశోక్ రాయ్ సోదరుడు సుబ్రహ్మణ్య రాయ్ ఇంట్లో భారీగా నగదు దాచినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. మైసూరులోని సుబ్రహ్మణ్య రాయ్ ఇంట్లో నిన్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఏమీ దొరకలేదు. కానీ ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టుపై బాక్స్ ను ఐటీ శాఖాధికారులు గుర్తించారు. ఈ బాక్స్ ను తెరిచి చూస్తే అందులో నగదును లభ్యమైంది.