హైదరాబాద్: 1995 లో టీడీపీ సంక్షోభం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ టీవీ షో లో వివరించారు. పార్టీని కాపాడుకొనేందుకు ఆనాడు తాను చేసిన ప్రయత్నాలను చంద్రబాబు వివరించారు. 1995 ఆగష్టులో టీడీపీలో సంక్షోభం ఏర్పడింది. ఎన్టీఆర్ నుండి చంద్రబాబునాయుడు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపు వచ్చారు. అటు తర్వాత ఎన్టీఆర్ వైపు ఉన్న ఎమ్మెల్యేలు కూడ చంద్రబాబు వైపే వచ్చారు.