crtoon punchCartoon punch on vande bharat express train
వందే భారత్ రైలుకు ప్రమాదం జరిగింది. ఈ నెల 6వ తేదీన పశువుల మంద ఢీకొనడంతో వందే భారత్ రైలు ముందు భాగం దెబ్బతింది. ముంబై నుండి గాంధీనగర్ కు రైలు వెళ్తున్న సమయంలో బట్వా మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది సెప్టెంబర్ 30 ప్రారంభించారు. ఈ రైలులో మోడీ కొంత దూరం ప్రయాణం చేశారు. విమానంలో మాదిరిగా ఈ రైలులో సౌకర్యాలుంటాయి. 180 కి.మీ వేగంతో రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలులో 16 కోచ్ లు ఉంటాయి. సాధారణ రైలులో ముంబై నుండి గుజరాత్ కు 9గంటల సమయం పడితే ఈ రైలులో 6 గంటల సమయం పడుతుంది. గాంధీ నగర్ ముంబై మధ్య ఈ రైలు నడుస్తుంది.