రాజస్థాన్ లోనూ అదే తప్పు: వైఎస్ జగన్ బాటలో సచిన్ పైలట్...?

First Published Jul 14, 2020, 6:55 PM IST

సచిన్ పైలట్ సన్నిహిత వర్గాలు మాత్రం సచిన్ పైలట్ బీజేపీలో చేరబోడని చెబుతున్నాయి. సచిన్ పైలట్ ఇప్పుడు ఎం చేస్తాడన్న విషయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తుంది. సచిన్ పైలట్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

దేశం యావత్తు ఇప్పుడు చర్చించుకుంటున్న అంశం ఎమన్నా ఉందంటే అది సచిన్ పైలట్ అంశం. కాంగ్రెస్ పైన్నే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పైలట్ తన వర్గం ఎమ్మెల్యేతో ఢిల్లీలో క్యాంపు వేసాడు. సీఎల్పీ సమావేశానికి రెండు సార్లు ఆహ్వానం పంపినప్పటికీ.... పైలట్ మాత్రం రాలేదు.
undefined
ఢిల్లీలోనే తన 21 మంది ఎమ్మెల్యేలతో ఉన్నాడు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అతనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ.... అది జరగలేదు. సచిన్ పైలట్ తాను ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నానని, తాను కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయాలనుకోవడం లేదని అంటున్నాడు.
undefined
ఇందాక కొద్దిసేపటికింద సచిన్ పైలట్ ను రాజస్థాన్ ఉపముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా తొలిగించారు. సచిన్ క్యాంపులో ఇద్దరు మంత్రులను కూడా వారి పదవులనుండి తొలిగించారు. అశోక్ గెహ్లట్ ప్రభుత్వానికి వచ్చిన అపాయం అయితే ఇప్పటికిప్పుడు మాత్రం ఏమీ లేదు. ప్రభుత్వంమెజార్టీలోనే ఉంది. మధ్యప్రదేశ్ తరహా సంఘటన మాత్రం ఇక్కడ జరగలేదు.
undefined
ఇక సచిన్ పైలట్ సన్నిహితవర్గాలు మాత్రం సచిన్ పైలట్ బీజేపీలో చేరబోడని చెబుతున్నాయి. సచిన్ పైలట్ ఇప్పుడు ఎం చేస్తాడన్న విషయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తుంది. సచిన్ పైలట్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
undefined
మరోపక్క బీజేపీ మాత్రం చాలా తెలివిగా వేచి చూసే ధోరణిలో ఉంది. రాజస్థాన్ కి చెందిన బీజేపీ ముఖ్యనేతలంతా జైపూర్ పయనమయ్యారు. అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తూ తొందరపడడానికి ఇష్టపడడంలేదు. మరోసారి మహారాష్ట్రలో నవ్వులపాలయినట్టు అవ్వదల్చుకోవడంలేదు.
undefined
కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ప్రస్తుతానికి పటిష్టంగానే ఉన్నట్టుగా కనబడుతుండడంతో.... సచిన్ పైలట్ తదుపరి వ్యూహమేమిటని అంతా ఎదురుచూస్తున్నారు. సచిన్ పైలట్ ఇప్పుడు బీజేపీలో చేరతారా, లేదా ఒక కొత్త పార్టీని నెలకొల్పుతాడా అనేది అందరూ ఎదురుచూస్తున్నారు..
undefined
పరిస్థితులను చూడబోతుంటే... సచిన్ పైలట్ గనుక నిజంగా ఆత్మగౌరవం కోసమే తిరుగుబాటు అనే జెండాను ఎగురవేసి ఉండిఉంటే... సొంత పార్టీని నెలకొల్పే ప్రయత్నం చేయాలి. పరిస్థితులను చూడబోతుంటే కూడా అలానే కనబడుతున్నాయి.
undefined
ఇప్పుడు సచిన్ పైలట్ ని చూస్తుంటే... మరో జగన్ మోహన్ రెడ్డి అవుతాడా అనే అనుమానం కలుగక మానదు. తండ్రి లేడు. బలమైన గుజ్జర్ సామాజికవర్గ నేత. రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు. పార్టీలో సీఎం పోస్ట్ తనకు దక్కలేదనే తిరుగుబాటు జెండా ఎగురవేశాడు.
undefined
గతంలో రాజస్థాన్ లో కిరోరి సింగ్ గుజ్జర్ ఉద్యమాన్ని నడిపినప్పటికీ.... రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకే ఛాన్స్ ఉందని గ్రహించి బీజేపీలో చేరిపోయాడు. ఇప్పుడు సచిన్ పైలట్ సైతం అదే బాటలో వెళ్తాడా లేదా జగన్ మోహన్ రెడ్డి బాటలో పయనించి రాజస్థాన్ లో నూతన రాజకీయ పార్టీని ఏర్పరుస్తాడా అనేది వేచి చూడాలి!
undefined
click me!