సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ.. మెడికల్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు..

Published : Jun 14, 2023, 01:21 PM IST

మనీ లాండరింగ్ కేసులో అరెస్టై.. ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీ మెడికల్ బులెటిన్ ను డాక్టర్లు విడుదల చేశారు.

PREV
17
సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ.. మెడికల్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు..

తమిళనాడు : మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీ.. ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను పరీక్షించిన తమిళనాడు గవర్నమెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు ఏంజియో గ్రామ్ నిర్వహించారు. 

27

ఇందులో ట్రిపుల్ వెస్సల్ డిసీస్ ఉందని తేలిందన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బైపాన్ సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. 

37

ఈ ఉదయం అరెస్టైన సెంథిల్ బాలాజీ ఒక్కసారి ఛాతినొప్పితో కూలిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు.. 10.40కి కరోనరి ఏంజియోగ్రామ్ చేశారు. ఈ మేరకు మెడికల్ బులిటిన్ విడుదల చేశారు. 

47

కాగా, తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేస్తున్న సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలనుంచి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో, కోయంబత్తూర్, కడూర్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. 

57

18 గంటలపాటు మంత్రి ఇంట్లో ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత మంత్రుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. భారీ స్థాయిలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా అధారాలు ఈడీకి లభించడంతో ఈ ఉదయం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. 

67

ఆ వార్త విన్న వెంటనే చాతినొప్పి అంటూ ఒక్కసారిగా కూలిపోయారు మంత్రి. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి, పరీక్షలు చేస్తున్నారు. 

77

మంత్రిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా గత రెండు రోజులుగా ఈడీ తమిళనాడులో పలు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!

Recommended Stories