Budget 2026 ను రూపొందించే నిర్మలమ్మ టీమ్ ఇదే.. తెలుగోడిదే కీలక పాత్ర..!

Published : Jan 21, 2026, 10:19 AM IST

Union Budget 2026-27 : కేంద్ర ప్రభుత్వం వచ్చేనెల ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ రూపకల్పనలో ఓ తెలుగు ఐఏఎస్ కీలకంగా వ్యహరిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగింటి కోడలు సారథ్యంలోని బడ్జెట్ టీంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. 

PREV
17
బడ్జెట్ 2026-27 తయారుచేసేది వీళ్లే..

Budget 2026 : ఓ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావడం ఆ ఇంటిపెద్ద ఒక్కరితోనే సాధ్యంకాదు... కుటుంబ సభ్యులంతా సమర్థులై ఉండి, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతుంటేనే సాధ్యం. దేశం విషయంలోనూ ఇంతే... అన్ని రంగాలు అద్భుత పనితీరు కరబర్చినప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు, అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇలా దేశ పాలన ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలంటే బడ్జెట్ కీలకపాత్ర పోషిస్తుంది. దేశ ఆదాయం, ఖర్చుల లెక్కలు ముందుగానే ప్లాన్ చేసుకోవడమే బడ్జెట్… ప్రతి ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్లాన్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది కేంద్రం.

బడ్జెట్ రూపకల్పన అనేది చాలా క్లిష్టమైన అంశం... ఆర్థిక అంశాలే కాదు ఇంకా అనేల అంశాలపై పట్టు ఉన్నవారే దీన్ని రూపొందించగలరు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టినా... దీని రూపకల్పన వెనక చాలామంది నిపుణుల శ్రమ ఉంటుంది. ఇలా బడ్జెట్ 2026-27 బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టీమ్ లో కీలక వ్యక్తుల గురించి తెలుసుకుందాం.

27
V. Anantha Nageswaran

వి. అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్

బడ్జెట్ 2026 రూపకల్పనలో ఈయన చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2022 నుండి అనంత నాగేశ్వరన్ కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేస్తున్నారు... చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ గా ఉన్నారు. గత నాలుగు బడ్జెట్స్ లోనూ పాలుపంచుకున్నారు. నాగేశ్వరన్ ఎకనమిక్ సర్వే 2025-26 రూపకల్పనలో పాలుపంచుకున్నారు.

37
Anuradha Thakur

అనురాధ ఠాకూర్

1994 కు చెందిన ఐపిఎస్ అధికారి. దేశ ఆర్థిక శాఖ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మొదటి మహిళ. బడ్జెట్ 2026-27 తయారీలో ఈమె కీలకం. పాలసీలు, ఫైనాన్షియల్ రీఫార్స్ పై ఈమె నిర్ణయాలు తీసుకోనున్నారు.

47
Arvind Shrivastava

అరవింద్ శ్రీవాస్తవ, రెవెన్యూ సెక్రటరీ

ఈయన కూడా 1994 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇతడికి బడ్జెట్ రూపకల్పనలో విశేష అనుభవం ఉంది. ముఖ్యంగా ట్యాక్స్ వ్యవహారాల్లో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి బడ్జెట్ లో ట్యాక్స్ రిఫార్మ్స్ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ఈయన డీల్ చేయనున్నారు.

57
V. Vualnam

వి. వుల్నమ్

ఆర్థిక శాఖ పరిధిలోని Department of Expenditure (DoE) సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఈయన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఫండ్స్, అప్పులను సరిచూసుకుని ఖర్చులను మేనేజ్ చేసే విషయాలపై ఈయన నిర్ణయాలు తీసుకుంటారు.

67
Arunish Chawla

అరునిష్ చావ్లా

DIPAM (Department of Investment and Public Asset Management) సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఈయన 1992 బ్యాచ్ బిహార్ ఐఏఎస్ అధికారి. ఆర్థిక శాఖ రూపొందించే బడ్జెట్ లో ఈయన కీలకంగా వ్యవహరిస్తున్నారు... ముఖ్యంగా కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటైజేషన్ అంశాలపై ఈయన నిర్ణయాలు తీసుకుంటారు.

77
M. Nagaraju

ఎం. నాగరాజు

ఫైనాన్షియల్ సర్వీస్ సెక్రటరీ ఎం. నాగరాజు తెలుగు వ్యక్తి. ఈయన విద్యాభ్యాసం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో సాగింది. ఈయన 1993 బ్యాచ్ త్రిపుర ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో కీలక పదవిలో ఉన్నారు. ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్, ఇండస్ట్రీస్ ఆండ్ కామర్స్, ట్రైబల్ వెల్పేర్, హెల్త్ కేర్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది.

బడ్జెట్ 2026 ను రూపొందించే నిర్మలా సీతారామన్ టీంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ సంస్కరణలు, MSME, ఎగుమతిదారుల వ్యవహారాల్లో ఈయన నిర్ణయాలు తీసుకొంటారు.

Read more Photos on
click me!

Recommended Stories