బి‌జే‌పి ఎం‌పి ఉదారత.. పుట్టినరోజున వెయ్యికి పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ..

బెంగళూరు, మే 31, 2021 : నమ్మా బెంగళూరు ఫౌండేషన్ బెంగళూరు ఫైట్స్ కరోనాపై సోమవారం వెబ్‌నార్ నిర్వహించింది. ఇందులో ఆర్‌డబ్ల్యుఎలు, సిఎస్‌ఓలు అలాగే బెంగళూరు సిటిజెన్స్ పాల్గొన్నారు.

bjp mp rajeev chandrashekhar distributed Grocery kits to poor people on his birthday in bengurluru
కరోనా సెకండ్ వేవ్ మహమ్మారిపై పోరాడేందుకు తీసుకున్న చర్యలు, విధానాలు గురించి చర్చించడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ తో పాటు ఎంపి, ఎన్‌బి‌ఎఫ్ ట్రస్టీ ఫౌండేర్ శ్రీ రాజీవ్ చంద్రశేకర్ కూడా పాల్గొన్నారు. ఇందుకు 200 మందికి పైగా సిటిజెన్లు హాజరయ్యారు అలాగే సిటిజన్లతో పరస్పర చర్య, వారి ప్రశ్నలకు ఇంటరాక్టివ్ సెషన్‌లో సమాధానం ఇచ్చారు.
bjp mp rajeev chandrashekhar distributed Grocery kits to poor people on his birthday in bengurluru
అలాగే నేడు నమ్మా బెంగళూరు ఫౌండేషన్ బెంగళూరు ఫైట్స్ కరోనాకు నిరంతర మద్దతుతో డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ నిర్వహించింది. ఫౌండేర్ అండ్ ఎన్‌బి‌ఎఫ్ ట్రస్టీ శ్రీ రాజీవ్ చంద్రశేకర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బెంగళూరులోని వివిధ ప్రాంతాలలో కిరాణా కిట్లు, వెల్ నెస్ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్స్, పిపిఇ కిట్‌లను పంపిణీ చేశారు.

ఈ పంపిణీ బెంగళూరు నగరంలోని వెయ్యికి పైగా కుటుంబాలకు, పౌరకర్మికలకు, పోలీసు సిబ్బందికి అందించటం జరిగింది. అలాగే టింబర్ యార్డ్, ఆర్‌పిసి లేఅవుట్, నంజంబన్న అగ్రహార, అశోక్ నగర్, విద్యారణ్యపుర, బొమ్మసాంద్ర, కోరమంగళ, తిలక్‌నగర్, సుదుగుంతనపాల్యాలలో కూడా పంపిణీ నిర్వహించారు.
నమ్మబెంగళూరు ఫౌండేషన్ గురించి:నమ్మబెంగళూరు ఫౌండేషన్ ఒక ఎన్‌జి‌ఓ, ఇది బెంగళూరు, బెంగళూరు పౌరులను వారి హక్కులను పరిరక్షించడానికి పనిచేస్తుంది. ఇది ఒక ఉతమైన బెంగళూరు నగరం కోసం న్యాయవాద, పార్ట్నర్ షిప్, ఆక్టివిజం ద్వారా పనిచేస్తుంది. సిటీ ప్లానింగ్, గవర్నన్స్, అవినీతిపై పోరాడటానికి, ప్రజా ధనం, ప్రభుత్వ ఆస్తుల జవాబుదారీతనం నిర్ధారించడానికి ఈ ఫౌండేషన్ ప్రజలకు ఒక వేదికగా పనిచేస్తుంది.
మరింత సమాచారం కోసం:వినోద్ జాకబ్ఇ-మెయిల్: vinod.jacob@namma-bengaluru.orgమొబైల్: +91 73497 37737

Latest Videos

vuukle one pixel image
click me!