వివాహేతర సంబంధం: భార్యా పిల్లల హత్య: సూసైడ్ చేసుకున్నభర్త

Published : Apr 16, 2023, 10:05 AM IST

వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో  విషాదం  నింపింది.  భార్యాపిల్లలను  హత్య  చేసి  ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. . ఈ ఘటన  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  కాన్పూర్ లో  చోటు  చేసుకుంది.  

PREV
15
వివాహేతర సంబంధం: భార్యా పిల్లల హత్య: సూసైడ్  చేసుకున్నభర్త
వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం  కలిగి  ఉందనే  అనుమానంతో   భార్యతో పాట ు ఇద్దరు పిల్లలను  అత్యంత  దారుణంగా  హత్య చేశాడు  భర్త. ఆ తర్వాత  తాను  ఉరేసుకొని  ఆత్మహత్య  చేసుకున్నాడు.  ఈ  ఘటన  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని   దేహత్  ప్రాంతంలో  చోటు చేసుకుంది.  

25
వివాహేతర సంబంధం

గుజరాత్  రాస్ట్రంలోని  ఓ ఫ్యాక్టరీలో  ఇంద్రపాల్  నిషాద్  అనే  వ్యక్తి పనిచేస్తున్నాడు.  అతని  వయస్సు  40 ఏళ్లు.  భార్యా పిల్లలను హత్య  చేసిన తర్వాత  నిషాద్  ఆత్మహత్య చేసుకున్నట్టుగా  పోలీసులు గుర్తించారు.  భార్యా, పిల్లల శరీరంపై  గాయాలను  పోలీసులు గుర్తించారు.   ఈ విషయం తెలిసిన వెంటనే  సీనియర్ పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి  చేరుకున్నారు.  కాన్పూర్  రేంజ్  ఐజీ  ప్రశాంత్  కుమార్,  కాన్పూర్  బేహత్  ఎస్పీ  బీబీజీటీఎస్  మూర్తిలు  సంఘటనస్థలానికి  చేరుకున్నారు. 
 

35
వివాహేతర సంబంధం

 సంఘటన స్థలంలో  క్లూస్ టీమ్  ఆధారలను  సేకరిస్తున్నారు.  గుజరాత్  రాష్ట్రంలో  పనిచేసే ప్రాంతం నుండి  రెండు  రోజుల క్రితం  ఇంద్రపాల్  నిషాద్  తన  స్వగ్రామానికి  చేరుకున్నారు.  వివాహేతర సంబంధం విషయంలో  భార్యాభర్తల మధ్య  ఘర్షణ  జరిగినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ కారణంగానే  భార్యాపిల్లలను  హత్య చేసి  ఇంద్రపాల్  సింగ్ నిసాద్  తాను  ఆత్మహత్య  చేసుకున్నాడని  ఎస్పీ మూర్తి  చెప్పారు. 

45
వివాహేతర సంబంధం

భార్యను హత్య  చేయడానికి ఒక్క రోజు ముందు  ఫేస్ బుక్ లైవ్ లో తన భార్య  మరో వ్యక్తితో వివాహేతర సంబంధం  కొనసాగిస్తుందని   నిషాద్   పోస్టు చేశారని  ఐజీ  కుమార్  మీడియాకు  తెలిపారు. మృతదేహలను  పోస్టుమార్టం  నిమిత్తం  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

55
వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం  కారణంగా   హత్యలు చేయడం  దేశవ్యాప్తంగా  పలు  రాష్ట్రాల్లో  ఇటీవల కాలంలో  ఎక్కువగా  చోటు  చేసుకుంటున్నాయి.  భార్యలు  ప్రియుళ్ల సహాయంతో  భర్తలను హత్య చేస్తున్నారు.  భర్తలు  భార్యలను  హత్య  చేస్తున్నారు. 

click me!

Recommended Stories