Ayodhya Ram Mandir : అంతా రామమయం ... సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్న అయోధ్య 

First Published | Jan 19, 2024, 12:45 PM IST

శ్రీరామ జన్మభూమి అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్దమయ్యింది. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సమయం దగ్గరపడుతుండటంతో అెయోధ్య నగరం రామయ్య కుడ్యచిత్రాలు, పెయింటింగ్స్ తో మరింత అందంగా తయారవుతుంది.    

Ayodhya

అయోధ్య : భారతదేశంలోని మెజారిటీ ప్రజల శతాబ్దాల కల నెరవేరబోతోంది. శ్రీరామ జన్మభూమి అయోధ్య భవ్యమైన రామమందిరం ఎట్టకేలకు నిర్మితమయ్యింది. అద్భుత శిల్పకళ, ఆశ్చర్యపరిచే అందాలతో అయోధ్య రామయ్య ఆలయం రెడీ అయ్యింది. ఈ ఆలయాన్ని దేశంలోని రాజకీయ, వ్యాపార, సినీ రంగానికి చెందినవారితో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖులందరి సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. నవంబర్ 22న జరిగే ఈ రామమందిర ప్రాణప్రతిష్ట (ప్రారంభోత్సవ) కార్యాక్రమంలో అయోధ్యా నగరం సుందరంగా ముస్తాబవుతోంది. 

ayodhya

హిందూ పురాణ గాధలు తెలిపేలా అయోధ్య ఆలయంలో శిల్పకళ సంపద వుంది.  హిందూ దేవతామూర్తులు శిల్పాలను కూడా ఆలయగోడలపై అందంగా చెక్కారు.  ఇలా చెక్కిన విష్ణుమూర్తి శిల్పాన్ని ఇక్కడ చూడవచ్చు. 


Ayodhya

ఇక రామయ్య ప్రియభక్తుడు హనుమంతుడి శిల్పాలు  అయోధ్య మందిరానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఆంజనేయుడు శిల్పాలను రామమందిర గోడలపై అద్భుతంగా చెక్కారు కళాకారులు. 

Ayodhya

అయోధ్య రామమందిర అందాలే మైమరిపించేలా వున్నాయి.  అందుకు తగ్గట్లుగా ప్రారంభోత్సవం కోసం భారీ సెట్టింగులు వేస్తున్నారు.  అయోధ్య ఆలయ ప్రాంగణంలో హిందూ దేవతామూర్తుల సెట్టింగ్ లను ఏర్పాటు చేస్తున్నారు.

Ayodhya

రామాయణ గాధను తెలిపే అనేక శిల్పాలను అయోధ్య నగరమంతా ఏర్పాటుచేస్తున్నారు. ఇలా సీతమ్మ కోసం లంకకు వెళ్లేందుకు సముద్రంలో వంతెన కడుతుండగా ఉడత సాయం చేయగా...దాన్ని ఆప్యాయంగా రామయ్య నిమిరిని శిల్పాన్ని ఇక్కడ చూడవచ్చు. 

Ayodhya

అయోధ్య నగరంలో ప్రతి గోడ రామాయణానికి సంబంధించిన ఏదో సన్నివేశాాన్ని గుర్తుచేసేలా పెయింటింగ్స్ వేస్తున్నారు. రామయ్య చిత్రాలతో కూడిన ఈ రంగురంగుల పెయింటింగ్స్ అయోధ్య నగరానికి మరింత అందాాన్ని అద్దుతున్నాయి. 

Ayodhya

కేవలం రామాయణమే కాదు హిందూ పురాణ గాధలతో కూడ్య చిత్రాలు అయోధ్య వీధుల్లో దర్శనమిస్తున్నాయి.  దీంతో అయోధ్య నగరం మరింత ఆద్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. 

Ayodhya

అయోధ్యలో ప్రస్తుతం ఎక్కడచూసినా రామనామమే వినిపిస్తోంది... రామయణ గాధే కనిపిస్తోంది.  ఇలా భక్తురాలు శబరి ఇచ్చిన  ఎంగిలిపళ్లను తింటున్న రాములోరి చిత్రమిది. 

Ayodhya

ఇక నాలుగైదు రోజులుగా అయోధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.  వేదమంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా ఆలయ ప్రారంభోత్సవానికి ముందు చేపట్టాల్సిన క్రతులన్ని పూజారులు నిర్వహిస్తున్నారు. 

Ayodhya

 అయోధ్య ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు అందుకోనున్న బాలరాముడి విగ్రహం ఇప్పటికే గర్భగుడిలోకి చేరింది. ఆ సుందరమూర్తికి చెందిన ఫోటోలు బయటకు వచ్చాయి. కమలంపై నిల్చున్న ఆ బాలరాముడి విగ్రహాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి లోనవుతున్నారు. 

Latest Videos

click me!