Rakesh Sharma became the first Indian to travel in Space in a Soviet rocket in the year 1984.
నేడు ప్రపంచమంతా అంతరిక్ష పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాయి. మన దేశం కూడా ఈ రంగంలో ముందంజలో ఉన్నది. అమెరికా, రష్యా వంటి దిగ్గజ దేశాల సరసన భారత్ కూడా నిలవడానికి ఎందరో కృషి ఉన్నది. ఈ రోజు అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష వాహక దినోత్సవం. ఈ సందర్భంగా అంతరిక్షం రంగంలో భారత్ గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖులను స్మరిద్దాం. రాకేశ్ శర్మ మొదలు నలుగురు కీలకమైన నలుగురు వ్యోమగాములను గుర్తు చేసుకుందాం. ఈ జాబితాలో తొలి పేరు కచ్చితంగా రాకేశ్ శర్మ పేరే వస్తుంది.
రాకేశ్ శర్మ భారత తొలి వ్యోమగామి. ఆయన సల్యూట్ 7 ఆర్బిటల్ స్టేషన్‌లో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపారు. అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి, ఏకైక భారతీయుడు రాకేశ్ శర్మనే. ఈయనతోపాటు పలువురు పేర్లూ మనం ప్రస్తావించవచ్చు. కానీ, వారిలో భారత మూలాలు ఉన్నా.. భారత పౌరులు కాదు.
రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన తర్వాత అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు ఓ ప్రశ్న వేశారు. స్పేస్ నుంచి భారత్‌ను చూస్తే ఎలా అనిపించింది? అని అడిగారు. ఇందుకు సమాధానంగా ఆయన ఇక్బాల్ రాసిన అద్భుత వ్యాఖ్యలను మననం చేసుకున్నారు. ‘సారే జహా సే అచ్చా’ అంటూ సమాధానం ఇచ్చి దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.