15 ఏళ్లకే దర్శకుడి కంట పడ్డాడు, రామ్ పోతినేని కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ ఇవే

Published : Nov 28, 2025, 12:00 PM IST

రామ్ పోతినేని దేవదాసు చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రీసెంట్ గా రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం విడుదలైంది. ఈ నేపథ్యంలో రామ్ కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
16
రామ్ పోతినేని సినిమాలు

హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. మహేష్ పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని కెరీర్ లో సాధించిన విజయాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్.. రామ్ పోతినేనికి బాబాయ్ అవుతారు. రామ్ పోతినేని 15 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే దర్శకుడు వైవిఎస్ చౌదరి కంట పడ్డారు. 17 ఏళ్ళ వయసు వచ్చేసరికి దేవదాసు రిలీజ్ అయింది. రామ్ పోతినేని కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

26
దేవదాసు 

దేవదాసు చిత్రం రామ్ కి డెబ్యూ మూవీ అయినప్పటికీ ఆ చిత్రంలో అతడి ఎనర్జీ అందరినీ ఆకట్టుకుంది. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్, ఇలియానా జంటగా నటించిన దేవదాసు సూపర్ హిట్ అయింది. ఇది ఇలియానాకి కూడా డెబ్యూ చిత్రమే. 

36
రెడీ 

దేవదాసు తర్వాత రామ్.. సుకుమార్ దర్శకత్వంలో జగడం చిత్రం చేశారు. ఈ చిత్రం రామ్ ని నటుడిగా మరో మెట్టు ఎక్కించింది కానీ కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. జగడం తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించిన రెడీ యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో రామ్, జెనీలియా కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. రామ్ తన కామెడీ టైమింగ్ తో కూడా మెప్పించారు. 

46
కందిరీగ

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్, హన్సిక జంటగా నటించిన కందిరీగ చిత్రం ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. కమర్షియల్ గా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

56
నేను శైలజ 

కందిరీగ తర్వాత రామ్ కి ఐదేళ్ల పాటు సరైన హిట్ లేదు. ఆ టైంలో వచ్చిన నేను శైలజ చిత్రం వైవిధ్యమైన ప్రేమ కథాగా ప్రేక్షకులని మెప్పించింది. ఈ చిత్రంతో రామ్ పరాజయాలకు బ్రేక్ పడింది. ఈ చిత్రంతోనే కీర్తి సురేష్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 

66
ఇస్మార్ట్ శంకర్ 

ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. 

 ఇక ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి వస్తే.. మంచి టాక్ అయితే మొదలైంది. వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయి అనేది చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories