అనంత్ అంబానీ, రాధిక జంట గణపతి చందా ఎంతిచ్చారో తెలుసా?

First Published Sep 11, 2024, 5:23 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు అనంత్ అంబానీ గణపతి చందా ఎంతిచ్చారో తెలుసా? పెళ్ళి తర్వాత మొదటిసాారి భార్య రాధికతో కలిసి వినాయక చవితి జరుపుకుంటున్న ఆయన జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేక కానుకను గణనాథుడికి సమర్పించారు.

Anant Ambani Radhika Merchant

Anant Ambani Radhika Merchant : వినాయక చవితి అనగానే ముందుగా గుర్తువచ్చేది చందాలు. వినాయక విగ్రహాలకొనుగోలు, మండపాల ఏర్పాటు, అన్నదానం, నిమజ్జనం...  ఇలా వినాయక చవితి ఖర్చుల కోసం చందాలు వసూలు చేస్తుంటారు. ఎవరి స్తోమతకు తగినట్లు వారు ఆర్థిక సాయం చేస్తుంటారు... బాగా ధనవంతులను కొంచెం ఎక్కువగా, పేద మద్యతరగతి వారివద్ద తక్కువగా చందాలు వసూలు చేస్తుంటారు నిర్వహకులు. 

ఇలా భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ప్రతిఏటా వినాయక చందా ఇస్తారు. ప్రపంచంలోని టాప్ శ్రీమంతుల్లో ఒకరైన ఆయన చందా ఇచ్చారంటే అది మినిమం కోట్లలో వుంటుందని అందరికీ తెలుసు.   

అంబానీ కుటుంబానికి ఈ వినాయక చవితి చాలా స్పెషల్. ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన వివాహబంధంతో   అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కొత్త జీవితం ప్రారంభించారు. వీరు జంటగా జరుపుకుంటున్న తొలి వినాయక చవితి ఇది. కాబట్టి ఈసారి పండగ జీవితాంతం గుర్తిండిపోయేలా జరుపుకుంటోంది అంబానీ కుటుంబం... అందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చుచేసింది. 

సాధారణంగానే అంబానీ కుటుంబానికి దైవభక్తి ఎక్కువ. వారు నివాసముండే ముంబైలో వినాయక చవితి వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబం కూడా పాల్గోంటుంది.ముంబైలోని లాల్ బాగ్ మహారాజా గణనాథుడిని అంబానీకి ప్రతిసారి భారీగా చందా ఇస్తుంటారు. అయితే ధన రూపంలో కాకుండా ఖరీదైన బహుమతుల రూపంలో కానుకలు సమర్పించి విఘ్ననాయకుడిపై భక్తిని చాటుకుంటుంది అంబానీ కుటుంబం. 

Anant Ambani

ఈ వినాయక చవితికి అంబానీ ఫ్యామిలీ కానుక ఇదే : 
 
ఇటీవల అంబానీల ఇంట అట్టహాసంగా వివాహం జరిగింది. ముఖేష్, నీతా అంబానీ దంపతులు చిన్నకొడుకు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన రాధిక మర్చంట్ ను పెళ్లాడాడు. కేవలం భారతీయులే కాదు యావత్ ప్రపంచమే ఆశ్చర్చపోయేంత గణంగా వీరి పెళ్లి జరిగింది. ఇలా మూడుముళ్ళ బందంతో ఒక్కటైన అనంత్‌-రాధిక జంటగా జరుపుకుంటున్న వినాయక చవితి ఇది. 

ఈ  వినాయక చవితి అనంత్, రాధిక దంపతులకు చాలా ప్రత్యేకమైనది. దీంతో  ఆ గణనాథుడికి భారీ కానుక ఇచ్చి పండగను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు ఈ నవ దంపతులు. ముంబైలోని లాల్ బాగ్ గణేషుడికి అనంత్  అంబానీ భారీ విరాళం ప్రకటించారు. ఏకంగా 20 కిలోల బంగారు కిరీటాన్ని ఈ గణనాథుడి అలంకరణ కోసం అందించారు అనంత్ అంబాని. 

అనంత్-రాధిక దంపతులు ముందునుండే  లాల్ బాగ్ వినాయకుడికి బంగారు కిరీటం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కిరీటం తయారీకి సమయం పడుతుంది కాబట్టి రెండు నెలల క్రితమే పనులు ప్రారంభించారు. ప్రత్యేకంగా బంగారు ఆభరణాలను తయారుచేసే స్వర్ణకారులతో ఈ కిరీటం చేయించారు. ఈ బంగారు కిరీటం విలువు రూ.15 కోట్లు వుంటుందని అంచనా. 

Latest Videos


Vinayaka Chavithi

అంబానీల ఇంట వినాయక చవితి వేడుకలు : 

ముఖేష్ అంబానీ నివాసంలో కూడా వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. నూతన దంపతులు అనంత్-రాధికతో పాటు కుటుంబసభ్యులంతా గణనాథుడి పూజలో పాల్గొన్నారు. అంబానీ బ్రదర్స్ ముఖేష్, అనిల్ కుటుంబాలు కలిసి వినాయక పూజా కార్యక్రమం నిర్వహించారు. 

తల్లి కోకిలాబెన్ ఇద్దరు పిల్లల కుటుంబాలతో కలిసి ఈ వినాయక చవితిని జరుపుకున్నారు. దక్షిణ ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాను వినాయక చవితి సందర్భంగా అందంగా ముస్తాబు చేసారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వినాయక మండపంలో స్వామివారిని ప్రతిష్టించారు. అంబానీ కుటుంబంలోని చిన్నా పెద్ద అందరూ వినాయక పూజలో పాల్గొన్నారు. 

ఇక అంబానీల ఇంట జరిగిన వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ కూడా పాల్గొన్నారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్  దంపతులతో పాటు అర్జున్ కపూర్, సోనమ్ కపూర్, అంశులా కపూర్, సారా అలీ ఖాన్, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా భార్య అంజలితో కలిసి ఈ వేడుకల్లొ పాల్గొన్నారు. ఈ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం కూడా ముగిసింది. 
 

Vinayaka Chavithi

దేశంలో రిచ్చెస్ట్ గణపతి ముంబైలోనే :  

వినాయక చవితి వేడుకలకు ముంబై చాలా ఫేమస్. వినాయక చవితి ప్రారంభం నుండి నిమజ్జనం వరకు ముంబై మామూలు సందడి వుండదు. కొన్ని దశాబ్దాల నుండి ఇక్కడ పూజలందుకుంటున్న గణనాథులు వున్నారు. ఇలా ముంబైలోనే కాదు దేశవ్యాప్తంగా పేరుగాంచినవి మాత్రం లాల్ బాగ్ మహా గణపతి, కింగ్ సర్కిల్ జిఎస్బి సేవా మండల్ గణపతులు.

లాల్ బాగ్ గణనాథులు విగ్రహం ప్రత్యేకం అయితే జిఎస్బి సేవామండల్ వినాయక మండపం ప్రత్యేకమైనది. ఈ మండపంకోసం నిర్వహకులు ప్రత్యేకంగా తీసుకునే ఇన్సూరెన్స్ వార్తల్లో నిలుస్తుంది. ఆల్ రికార్డును బద్దలుగొడుతూ ఈసారి ఏకంగా రూ.400.58 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించారు. గణనాథుడి విగ్రహం, మండపం, నిర్వహకులు, సేవా సిబ్బంది, పార్కింగ్, సెక్యూరిటీతో పాటు భక్తులకు కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. 

జిఎన్బి సేవామండల్ గణనాథుడిని ఏర్పాటుచేయబట్టి 70 సంవత్సరాలు అవుతోంది.  ఈ సందర్భంగా మరింత ప్రత్యేకంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించేందుకు సిద్దమై భారీ ఇన్సూరెన్స్ చేయించారు.   2023 లో 360 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించారు.
 

Vantara

అనంత్ అంబానీ ఏనుగుల సంరక్షణ : 

రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసుడు అనంత్ అంబానీ మంచి జంతు ప్రేమికుడు. ఈయన ప్రతి ఏడాది వందలకోట్లను జంతు సంరక్షణ కోసం ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వీటి సంరక్షణకు వంటారా అనే ప్రాజెక్టును నడుపుతున్నారు.  

గుజరాత్ లోని తమ స్వస్థలం జామ్ నగర్ లో ఏనుగుల సంరక్షణ కోసం 600 ఎకరాల విశాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అనారోగ్యంతో వుండే ఏనుగులను ఇక్కడకు తీసుకువచ్చి ప్రత్యేక వైద్యం అందిస్తారు. ఏనుగుల కోసం ఇక్కడ ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించారు. ఇందుల 200 లకు పైగా ఏనుగులను సంరక్షిస్తున్నారు.

click me!