భారతరత్న పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ జయంతి... నివాళి అర్పించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

First Published | Sep 10, 2024, 4:49 PM IST

భారత రత్న పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళి అర్పించారు. ఇవాళ (మంగళవారం, సెప్టెంబర్ 10) ఆయన137వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  

స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ తో కలిసి పాల్గోన్నారు ఉత్తర ప్రదేశ్ కు చెందిన గోవింద్ వల్లభ్ పంత్. స్వాతంత్య్రం తర్వాత రాజకీయ నాయకుడిగా మారిన ఆయన  ఉత్తర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసారు.  కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేసారు. ఇలా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వల్లభ్ పంత్ 137వ జయంతి నేడు. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు.

వల్లభ్ పంత్ కు నివాళి అనంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, తర్వాత కేంద్ర హోంమంత్రిగా పంత్‌ సుదీర్ఘ కెరీర్‌ను యోగి కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా పంత్ అంకితభావాన్ని  ప్రశంసించారు... మహాత్మా గాంధీ పిలుపు మేరకు న్యాయవాద వృత్తిని విడిచిపెట్టిమరీ స్వాతంత్య్ర పోరాటంలో చేరారని    గుర్తుచేసుకున్నారు.
 


కారాగారంలో చిత్రహింసలు భరించారు... దేశానికి స్వాతంత్య్రం కోసం పంత్ జీ తన నిబద్ధతను కొనసాగించారు. స్వాతంత్య్ర పోరాటంలో పంత్ చేసిన అవిశ్రాంత కృషి ఫలితంగానే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1954 వరకు ఈ పదవిలో పనిచేస్తూ, రాష్ట్ర ప్రగతికి పునాది వేశారు. ప్రాథమిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలను అందించడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ద్వారా  ఉత్తరప్రదేశ్ అభివృద్దికి బాాటలు వేసారు'' అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 

ఇంకా సీఎం మాట్లాడుతూ "1954-55లో, పంత్ భారతదేశ హోంమంత్రి అయ్యారు, ఈ సమయంలో హిందీని అధికార భాషగా చేయాలని ప్రతిపాదించారు." అని  తెలిపారు. 

యూపీ మాజీ సీఎం వల్లభ్ పంత్ జయంతి కార్యక్రమంలో సీఎం యోగితో పాటు ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, మంత్రులు   రాకేష్ సచన్,  జైవీర్ సింగ్, మేయర్ సుష్మా ఖర్క్వాల్, శాసన మండలి సభ్యుడు ముఖేష్ శర్మ, లాల్జీ ప్రసాద్ నిర్మల్, రాంచంద్ర ప్రధాన్, ఎమ్మెల్యే నీరజ్ బోరా తదితరులు పాల్గొన్నారు.

Latest Videos

click me!