అయోధ్య ఆలయ జిఎస్టి
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ప్రాంతం సాక్షాత్తు ఆ రామచంద్రుడు పుట్టిపెరిగిన పవిత్ర ప్రాంతంగా హిందువులు నమ్ముతారు. అందువల్లే శతాబ్దాల పోరాటం తర్వాత ఇక్కడే రామమందిర నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు అయోధ్య భారతదేశంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా మారింది.
రామాలయం నిర్మాణం తర్వాత అయోధ్యకి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాదు విదేశాల నుంచి వచ్చిమరీ హిందువులు బాలరాముడిని దర్శించుకుంటున్నారు.
రామ మందిరం
బాలరాముడు కొలువైన ప్రధాన ఆలయంతో పాటు చుట్టుపక్కల మరికొన్ని ఆలయాల నిర్మాణాలపనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణాలకు సంబంధించిన ఆసక్తికర వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తాజాగా వెల్లడించారు.
అయోధ్య ఆలయం
మహర్షి వాల్మీకి, శబరి, తులసీదాస్ ఆలయాలతో సహా 70 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 18 ఆలయాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికి 100% పన్ను చెల్లిస్తామని... ఒక్క రూపాయి కూడా బకాయి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.
రామ మందిరం నిర్మాణం
అయోధ్య రామాలయం దేశ ప్రజల సహకారంతో నిర్మితమైందని అన్నారు. రెండు లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా ఎలాంటి ఇబ్బందిలేకుండా ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ఎందరో ప్రాణాలను సైతం త్యాగం చేసారన్నారు. స్వాతంత్ర పోరాటానికి ఈ పోరాటం సమానమైనదని అన్నారు.
GST
ఆలయ ప్రాంగణంలోనే శివాలయం కూడా నిర్మిస్తున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని బగవా గ్రామం అద్భుతమైన శివలింగాలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిందని... ఇక్కడ తయారయ్యే శివలింగాలకు దేశ, విదేశాల్లో గిరాకీ ఉందన్నారు. ఇక్కడే రామమందిర ప్రాంగణంలో ప్రతిష్టించే శివలింగం కూడా రూపుదిద్దుకుంటోందని చంపత్ రాయ్ వెల్లడించారు.
అయోధ్యలో చేపడుతున్న ఆలయాల ద్వారా ప్రభుత్వానికి రూ.400 కోట్ల వరకు GST వసూలయ్యే అవకాశం వస్తాయని అంచనా వేసారు. పనులు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన పన్ను మొత్తం తెలుస్తుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.