ఆఫ్రికన్ చీతాలు : 68యేళ్ల క్రితం అంతరించి.. తిరిగి జాతీయపార్కుల్లో దర్శనమివ్వనున్నాయి..

First Published Jun 15, 2021, 1:46 PM IST

68యేళ్ల క్రితం అంతరించిపోయిన ఆఫ్రికన్ జాతి చిరుతలు మళ్లీ దేశంలో కనువిందు చేయనున్నాయి. భారత్ లో మళ్లీ చిరుత పరుగులు పెట్టనుంది. 1952లో దేశంలో చిరుతలు అంతరించిపోయాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. మెరుపువేగంతో పరిగెత్తే చీతాలు మళ్లీ దేశ అడవుల్లో కనువిందు చేయనున్నాయి.

68యేళ్ల క్రితం అంతరించిపోయిన ఆఫ్రికన్ జాతి చిరుతలు మళ్లీ దేశంలో కనువిందు చేయనున్నాయి. భారత్ లో మళ్లీ చిరుత పరుగులు పెట్టనుంది. 1952లో దేశంలో చిరుతలు అంతరించిపోయాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. మెరుపువేగంతో పరిగెత్తే చీతాలు మళ్లీ దేశ అడవుల్లో కనువిందు చేయనున్నాయి.
undefined
త్వరలోనే అంతా మారబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతలను తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు మధ్యప్రదేశ్ అటవీ శాఖ మంత్రి విజయ్ షా తెలిపారు. చివరి చిరుత 1947 లో ఛత్తీస్‌గడ్ లో మరణించింది.
undefined
దక్షిణాఫ్రికానుంచి మధ్యప్రదేశ్‌కు ఎనిమిది చిరుతలు రానున్నాయి. ఇందులో ఐదు మగవి, మూడు ఆడ చిరుతలు ఉన్నాయి. ఇప్పుడు దేశంలో చిరుతలు మనుగడ సాగించేందుకు వీలైన అన్ని వనరులు భారతదేశంలోని నేషనల్ పార్కులో ఉన్నాయని అన్నారు.
undefined
ఈ సంవత్సరం చివరి నాటికి చిరుతలు మన దేశానికి చేరుకుంటాయి. దేశవ్యాప్తంగా అన్ని సౌకర్యాలూ కలిగి ఉన్న జాతీయ ఉద్యానవనాల్లో చిరుతలను ప్రవేశపెట్టడానికి ఇంతకు ముందే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
undefined
వీటిని చూసుకోవడం ఎలా సెన్సిటివ్ గా వ్యవహరించాలి అనే విషయాల్లో కోసం జూన్, జూలై నెలల్లో భారత్ నుంచి అధికారులను దక్షిణాఫ్రికాకు పంపుతుంది. చిరుతల రవాణా నవంబర్‌లో ప్రారంభమవుతుంది.
undefined
చిరుతల మనుగడ అనేక రకాలఅంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశంలో ఇప్పటికే ఇతర రకాల పులులు ఉన్నాయి. అయితే ఇక్కడ సంక్షోభ పరిస్థితులు చిరుతల మనుగడకు ప్రమాదకరంగా మార్చేశాయి.
undefined
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో దక్షిణాఫ్రికా నిపుణుడు కునో నేషనల్ పార్క్‌ను సందర్శించారు. వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులతో కలిసి తనిఖీ చేశారు.
undefined
ఈ తనిఖీల తరువాత వీరు నేషనల్ పార్క్ ను చిరుతలకు సరైన నివాసంగా అంగీకరించారు. దీంతో వాటిని దేశంలో తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులు చిరుతలకు సాధ్యమైనంత ఉత్తమమైన ఆవాసాల కోసం రాష్ట్రంలోని నాలుగు స్థానాలను పరిశీలించారు.
undefined
click me!