విడ్డూరం : కరోనా దేవి పేరిట గుడి.. 48 రోజుల మహాయాగం.. ఎక్కడంటే...

First Published May 21, 2021, 5:00 PM IST

మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అంటే ఏం సమాధానం చెబుతాం. అలాగే ఉంటుంది కొందరి పోకడ. ఓ వైపు కరోనాతో దాని వెన్నంటి వస్తున్న బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ మహమ్మారులతో లోకం అతలాకుతలం అయిపోతుంటే.. తమిళనాడులో ఏకంగా కరోనా దేవి పేరిట ఓ ఆలయమే వెలిసింది. 

undefined
తమిళనాడులో తన అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులకు విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఆలయాలు నిర్మించి పూజలు చేయడం పరిపాటి. అయితే తాజాగా కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.
undefined
కరోనా అంతం కావాలంటూ దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు చేపడుతున్నారు.
undefined
ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ఆలయంలో కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కామాక్షిపురి ఆలయంలో ఒకటిన్నర అడుగు ఎత్తున కరోనా దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
undefined
అంతే కాదు 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, మహా యాగం చేపట్టాలని నిర్ణయించారు.ఈ సమయంలో భక్తులెవర్నీ ఆలయంలోనికి అనుమతించబోమని తెలిపారు.
undefined
అయితే గతంలో కూడా కలరా, తట్టు, మశూచి వంటి వ్యాధుల ప్రబలినప్పుడు తమిళనాడులోని పలు గ్రామాల్లో మరియమ్మన్, బ్లాక్‌ మరియమ్మన్‌, మగలియమ్మన్‌ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేశారు. ఇప్పుడు కూడా అదే రకంగా విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేయాలని నిర్ణయించారు.
undefined
click me!