అసలు ఏమిటీ పే కమీషన్ :
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఫించనుదారులకు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా జీతాలను, అలవెన్సులను, పెన్షన్ ప్యాకేజీలను సవరించడానికి ఏర్పాటుచేసేవే ఈ పే కమీషన్స్ (వేతన సంఘాలు). ప్రస్తుతకాలంలో మనిషి జీవన వ్యయాలు రోజురోజులు కు పెరుగుతున్నాయి... దీంతో ఆర్థిక అవసరాలు ఎక్కువయ్యాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అవసరాలను తగ్గట్లుగా జీతాలను, అలవెన్సులను నిర్ణయించే బాధ్యత ఈ పే కమీషన్ కు అప్పగిస్తుంది ప్రభుత్వం.
పదేళ్లకు ఓసారి వేతన సంఘాన్ని ఏర్పాటుచేసి ఉద్యోగుల జీతాలు, అలవెన్సులను సవరిస్తారు. ఇలా ప్రస్తుతం 7వ వేతన సంఘం సిపార్సులు అమలులో వున్నాయి. 2014లో ఈ పే కమీషన్ ను ఏర్పాటుచేయగా 2016 నుండి సిపార్సులు అమల్లోకి వచ్చాయి. అంటే 2026 తో పదేళ్ల కాలం పూర్తవుతుంది. కాబట్టి 8వ వేతన సంఘం సిపార్సులను అమలుచేయాల్సి వుంటుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు ముగియగానే అంటే వచ్చే సంవత్సరం ఆరంభంలోనే వేతన సంఘాన్ని ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 2026 జనవరి నుండి 8వ వేతన సంఘం సిపార్సులను అమలు చేయనున్నారు.