వివాహేతర సంబంధం : స్నేహితుడి మేనమామ భార్యతో అక్రమసంబంధం.. ఫ్రెండ్ హత్య...

Published : Jul 05, 2023, 12:42 PM IST

మేనమామ భార్యతో స్నేహితుడు అక్రమసంబంధం పెట్టుకున్నాడని అతడిని హతమార్చాడో ఓ యువకుడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 

PREV
16
వివాహేతర సంబంధం : స్నేహితుడి మేనమామ భార్యతో అక్రమసంబంధం.. ఫ్రెండ్ హత్య...

తమిళనాడు : ఓ వ్యక్తి తన స్నేహితుడి అత్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో కోపానికి వచ్చిన స్నేహితుడు అతడిని దారుణంగా హతమార్చాడు.  ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.  స్నేహితుడిని చంపిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

26

తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా వెలగౌండంపట్టిలోని అక్కలంపట్టి అరుంధతి కాలనీకి చెందిన కందస్వామి కుమారుడు శీను (23).  అతనికి  అదే పట్నానికి చెందిన ప్రవీణ్ కుమార్ (21) అనే వ్యక్తితో స్నేహం  ఏర్పడింది. ప్రవీణ్ కుమార్.. తన మేనమామ, అత్తలతో కలిసి  వారింట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో  శీను తరచుగా ప్రవీణ్ ను కలవడానికి ఇంటికి వస్తుండేవాడు.

36

అలా శీనుకు ప్రవీణ్ మేనమామ భార్య మీనా (29)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం మేనమామ సత్యకు తెలిసింది. దీంతో ఆమెను మందలించాడు. భర్తకు తెలిసిందన్న విషయం తెలిసినా కూడా ఆమె శీనుతో వివాహేతర సంబంధాన్ని వదులుకోలేకపోయింది.

46

దీంతో భర్త గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. ఈ పంచాయతీలో గ్రామ పెద్దలు వారిద్దరిని మరోసారి కలవద్దని తెలిపారు.  ఈ మేరకు వారిద్దరు కూడా కలవకూడదని నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలోనే శీను మీద ప్రవీణ్ కోపం పెంచుకున్నాడు. తనతో స్నేహం చేయడానికి వచ్చి తన అత్తమామలకు చెడ్డ పేరు తెచ్చాడని శీనుని చంపేయాలని అనుకున్నాడు.

56

దీనికోసం పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు దీంట్లో భాగంగానే సోమవారం రాత్రి శీను ఇంటికి వెళ్ళాడు. ఇంటి బయట పడుకున్న శీను మెడ, ఛాతి, తొడలపై కత్తితో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. 

66

పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నామక్కల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపించారు. పరారీలో ఉన్న ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

click me!

Recommended Stories