బీహార్ : బీహార్ లోని ఓ ఇంట్లో కుప్పలు తెప్పలుగా పాములు బయటికి వస్తూ కలకలం రేపాయి. బీహార్ లోని రోహ్తాస్ పట్టణంలో ఈ భయంకర ఘటన వెలుగు చూసింది. ఒకే ఇంట్లో 50 నుంచి 60 పాములు కనిపించాయి. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొన్నాయి.
26
పట్టణంలోని సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అగ్ రోడ్ ఖుర్ద్ గ్రామంలో ఉన్న ఓ ఇంట్లో ఇది జరిగింది. ఆ ఇంట్లో.. మొదట ఒక పాము కనిపించింది.. ఆ తర్వాత మరొకటి ఆ తర్వాత ఇంకొకటి… అలా దాదాపుగా 50 నుంచి 60 పాములు ఇంట్లో నుంచి బయటికి వచ్చాయి.
36
అప్పటికి ఇంకా పాములు బయటికి వస్తుండడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు సహాయక బృందాలతో కలిసి గురువారం నాడు ఆ ఇంట్లో ఉన్న పాములన్నింటినీ పట్టుకున్నారు.
46
దీనికోసం ఇంటి గోడలు, ఫ్లోరింగు పగలగొట్టారు. అలా ముందు చంపిన రెండు డజన్ల పాములు కాకుండా సుమారు మరో 30 పాములను వెలికి తీశారు. ఈ పాములన్నీ కూడా విష సర్పంజాతి అయిన ఇండియన్ కోబ్రాకు చెందినవవే.
56
ఈ పాములను స్నేక్ క్యాచార్ అమర్ గుప్తా పట్టుకుని, సమీపంలోని అడవిలో వదిలేస్తామని తెలిపారు. ఈ ఇంటిని నిర్మించి దాదాపు 70 ఏళ్లవుతోంది. 1955 లో ఇంటిని కృపా నారాయణ్ తెలిపారు.
66
ఈ పాములను స్నేక్ క్యాచార్ అమర్ గుప్తా పట్టుకుని, సమీపంలోని అడవిలో వదిలేస్తామని తెలిపారు. ఈ ఇంటిని నిర్మించి దాదాపు 70 ఏళ్లవుతోంది. 1955 లో ఇంటిని కృపా నారాయణ్ తెలిపారు.