దేశంలో అసలు మద్యమే దొరకని ప్రాంతాలున్నాయి... అవేంటో తెలుసా?

First Published | Sep 6, 2024, 10:54 PM IST

మద్యపానం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మోపుతుందని అందరికీ తెలుసు. కానీ మద్యానికి బానిసలైన వారికి దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు. అందుకే కొన్ని రాష్ట్రాలు మద్యాన్ని పూర్తిగా నిషేధించాయి. మద్యం సేవించినా కఠిన శిక్షలు విధిస్తారు. ఇలాంటి రాష్ట్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం ఒకటి. ఈ శాఖ ఆదాయం ఆధారంగానే ప్రభుత్వ బడ్జెట్‌ను నిర్ణయిస్తారనడంతో అతిశయోక్తి లేదు. ప్రభుత్వాలు ఖజానాను నింపుకోవడానికి మద్యం ధరలను పెంచుతూ ఉంటాయి. కానీ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మద్యాన్ని పూర్తిగా నిషేధించాయి.  ఆ రాష్ట్రాలు ఏమిటో ఇక్కడ చూడండి.

బిహార్

ఏప్రిల్ 2016 లో బిహార్ రాష్ట్రవ్యాప్తంగా మద్య నిషేధం అమల్లోకి వచ్చింది. నేరాలను అరికట్టే ప్రయత్నంలో భాగంగా మద్య నిషేధం విధించింది ప్రభుత్వం. ఈ నిర్ణయం బాగానే వున్నామద్యం అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది.  పొరుగు రాష్ట్రాల నుండి బిహార్‌కు మద్యం ఏరులై పారుతోంది.  

Latest Videos


గుజరాత్

1960 లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గుజరాత్ మద్య నిషేధాన్ని అమలు చేస్తోంది. గాంధీజీ సిద్ధాంతాలను ఇక్కడ కఠినంగా పాటిస్తారు. అంతేకాకుండా కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. ఇలాంటి రాష్ట్రంలోనూ ఎన్నికల సమయంలో రహస్యంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తుంటాయి. 

మిజోరం

చర్చిలు, మహిళా సంఘాల నేతృత్వంలో మిజోరం 1997 లో మద్య నిషేధం అమలు చేయబడింది. 2015-2019 మధ్య కాలంలో నిషేధాన్ని ఎత్తివేశారు. అయితే తిరిగి నిషేధం అమలు చేశారు. మద్యం అమ్మకాల నిషేధంపై ఇక్కడ ఇప్పటికీ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

లక్షద్వీప్

లక్షద్వీప్‌లో కఠినమైన మద్యపాన చట్టాలు ఉన్నాయి. ద్వీపంలోని కొన్ని రిసార్ట్‌లకు మాత్రమే మద్యం అమ్మకాలు, వినియోగాన్ని పరిమితం చేశారు. లక్షద్వీప్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కాబట్టి రిసార్ట్‌లలో మాత్రమే మద్యం లభిస్తుంది. లక్షద్వీప్‌లో స్థానికంగా మద్యం   అమ్మకాలు పూర్తిగా నిషేధించబడ్డాయి.

click me!