షాకింగ్ : 420 మంది డాక్టర్లను బలితీసుకున్నసెకండ్ వేవ్, ఒక్క ఢిల్లీలోనే 100మంది...

First Published May 22, 2021, 4:07 PM IST

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా 420మంది డాక్టర్ల ప్రాణాలు బలి తీసుకుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. వీరిలో కేవలం ఢిల్లీకి చెందిన డాక్టర్లే వందమంది ఉన్నారని పేర్కొంది. 

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా 420మంది డాక్టర్ల ప్రాణాలు బలి తీసుకుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. వీరిలో కేవలం ఢిల్లీకి చెందిన డాక్టర్లే వందమంది ఉన్నారని పేర్కొంది.
undefined
వైరస్ సోకి ఆసుపత్రులకు రోగులు పోటెత్తడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని వారు తెలిపారు. ఏప్రిల్‌లో తీవ్ర స్థాయికి చేరుకున్న కరోనా సంక్షోభం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కాస్త తగ్గుముఖం పట్టింది.
undefined
ఇక మరణించిన వారిలో బీహార్‌లో కనీసం 96 మంది, ఉత్తరప్రదేశ్‌లో 41 మంది వైద్యులు మరణించినట్లు వైద్యుల సంఘం తెలిపింది.
undefined
ఈ వారం ప్రారంభంలో, కరోనావైరస్ కారణంగా 270 మంది వైద్యులు మరణించినట్లు ఉన్నత వైద్య సంస్థ నివేదించింది. కరోనా కాటుకు బలైన వారిలో మాజీ ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ కెకె అగర్వాల్ కూడా ఉన్నారు. 65 సంవత్సరాల అగర్వాల్ ఈ సోమవారం మరణించిన సంగతి తెలిసిందే.
undefined
డాక్టర్ అగర్వాల్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. అయినా ఆయన సోమవారం రాత్రి 11.30 గంటలకు "కరోనాతో సుదీర్ఘ పోరాటం తరువాత" మరణించినట్లు ఆయన ట్విట్టర్ ఖాతాలో ఒక అధికారిక ప్రకటన వెలువడింది.
undefined
IMA, COVID-19 రిజిస్ట్రీ ప్రకారం, మహమ్మారి ఫస్ట్ వేవ్ లో కరోనాతో 748 మంది వైద్యులు మరణించారు."మహమ్మారి సెంకడ్ వేవ్ అందరికీ.. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్క్ అయిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ప్రాణాంతకంగా మారింది’’అని ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ జెఎ జయలాల్ గతవారం తెలిపారు.
undefined
అయితే IMA రికార్డుల్లో ఉన్న డాక్టర్లు 3.5 లక్షల మంది మాత్రమే.. కాగా దేశ వ్యాప్తంగా మొత్తం 12 లక్షలకు పైగా వైద్యులు ఉన్నారు.గత 24 గంటల్లో దేశంలో 2,57,299 తాజా COVID-19 కేసులు నమోదయినట్టు, 4,194మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు తెలియజేసింది.
undefined
శుక్రవారం, వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఉద్వేగానికి లోనయ్యారు.
undefined
ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ఆరోగ్య కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వైద్యులు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
undefined
"కరోనా సెకండ్ వేవ్ లో, ఒకే సమయంలో అనేక విషయాలమీద పోరాటం చేయాల్సి వస్తోంది. సంక్రమణ రేటు చాలా ఎక్కువగా ఉంది. వైరస్ సోకిన వారు ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తోంది" అని పిఎం మోడీ అన్నారు.
undefined
మే ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకున్న తరువాత, గత రెండు వారాల్లో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి, అయితే రానున్న థార్డ్ వేవ్ పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపనుందని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
click me!