4 Day Work Week: వారానికి 4 రోజులే ప‌నిదినాలు.. మరి జీతం మాటేమిటి?.. వచ్చే ఏడాది నుంచే కొత్త లేబర్ కోడ్స్..!

Published : Dec 21, 2021, 02:14 PM IST

దేశంలో కొత్త కార్మిక విధానాన్ని అమ‌లు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది. ప్రస్తుత వారానికి 5 రోజుల పనిదినాలు ఉండగా.. కొత్త విధానం ప్రకారం వారానికి 4 రోజులు పనిదినాలు (4 day work week) ఉండనున్నాయి. మరి ఉద్యోగుల జీతాలు, పని గంటలు, పీఎఫ్‌ ఎలా ఉండనున్నాయంటే..  

PREV
17
4 Day Work Week: వారానికి 4 రోజులే ప‌నిదినాలు.. మరి జీతం మాటేమిటి?.. వచ్చే ఏడాది నుంచే కొత్త లేబర్ కోడ్స్..!

దేశంలో కొత్త కార్మిక విధానాన్ని అమ‌లు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది. ప్రస్తుత వారానికి 5 రోజుల పనిదినాలు ఉండగా.. కొత్త విధానం ప్రకారం వారానికి 4 రోజులు పనిదినాలు (4 day work week) ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనికి అమలు చేసేందుకు కేంద్రం యోచిస్తున్నట్టుగా ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపినట్టుగా పీటీఐ వార్త సంస్థ పేర్కొంది. 

27

వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రతపై నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను (new labour codes) అమలు చేసే దిశగా కేంద్రం కసరత్తులు చేస్తుంది. ఈ కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం.. సాధారణంగా ఉపాధి, పని సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలు మార్పులు చోటుచేసుకోవచ్చు. ఉద్యోగుల పని గంటలు, చేతికి అందే జీతం (take-home salary), పీఎఫ్‌ విషయాలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. 

37

నాలుగు రోజులు పని.. రోజుకు 12 గంటలు.. 
కొత్త లేబర్ కోడ్‌లు అమలు చేయబడితే.. భారతదేశంలోని ఉద్యోగులు ప్రస్తుత ఐదు రోజుల పనివారానికి భిన్నంగా, వచ్చే ఏడాది నుండి నాలుగు రోజుల పనివారాన్ని ఆస్వాదించగలిగే వీలు ఉంటుంది. వారానికి 4 రోజుల ప‌నిదినాలు అంటే ఆ వారంలో 3 రోజులు సెలవు. అయితే.. వారానికి 48 గంట‌ల ప‌నిని పూర్తి చేయాలని కేంద్ర కార్మిక మంత్రి స్పష్టం చేయడంతో.. ఉద్యోగులు ఆ నాలుగు రోజుల్లో 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. 
 

47

లేబర్ కోడ్‌లు కూడా ఒకసారి అమలులోకి వస్తే ఉద్యోగులు ప్రాథమిక వేతనం, ప్రావిడెంట్ ఫండ్ (PF) గణన విధానంలో పెద్ద మార్పును తీసుకువస్తాయని ప్రతిపాదిత లేబర్ కోడ్‌లను అంచనా వేస్తున్న నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల టేక్ హోమ్ చెల్లింపులో తగ్గింపు ,  సంస్థలు అధిక ప్రావిడెంట్ ఫండ్ బాధ్యతను భరించవలసి ఉండే అవకాశం ఉంది.

57

పీఎఫ్‌ విషయానికి వస్తే.. అందులో యజమానులు చెల్లించాల్సిన వాటా శాతం పెరిగేలా నిబంధనలను మారుస్తారు. ఫలితంగా ఇంటికి తీసుకెళ్లే జీతం తగ్గుతుంది. భవిష్యనిధి మొత్తం పెరుగుతుంది. ప్రతి నెల PF ఖాతాకు ఉద్యోగుల సహకారం పెరుగుతుంది.. అదే సమయంలో నెలవారీ జీతం తగ్గుతుంది.
 

67

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు లేబర్ కోడ్‌ల‌కు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది. అయితే కార్మిక వ్య‌వ‌స్థ కేంద్ర-రాష్ట్రా ప‌రిధిలోని ఉమ్మడి అంశం కావున.. ఇందుకు సంబంధించిన మార్పుల‌ను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూచించాల్సి ఉంటుంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ లేబర్ కోడ్‌లు అమలులోకి వచ్చే అవకాశం ఉంది
 

77

కొత్త లేబర్‌ కోడ్‌లలో.. ‘వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు’ కోడ్‌కు సంబంధించి 13 రాష్ట్రాలు ముసాయిదా నిబంధనలు రూపొందించినట్టు కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్‌ యాదవ్‌ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

click me!

Recommended Stories