యమగోల రివ్యూ, ఎన్టీఆర్ దెబ్బకు ఒళ్లు నొప్పులతో 3 రోజులు మంచమెక్కిన జయప్రద, బాలకృష్ణ చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యింది?

Published : Oct 19, 2025, 08:58 AM IST

సీనియర్ ఎన్టీఆర్ అనగానే ఫ్యాన్స్  పౌరాణికం వైపే చూస్తారు. కానీ ఎన్టీఆర్ ఖాతాల్లో యమగోల లాంటి అద్భుతమైన సోషియో ఫాంటసీ సినిమాలు కూడా ఉన్నాయి. జయప్రద జోడీగా ఎన్టీఆర్ నటించిన యమగోల సినిమా ఎప్పుడైనా చూశారా? మూవీ ఎలా ఉంటుంది? అందులో హైలెట్స్ ఏంటి?

PREV
18
బెంగాలి సినిమాకు రీమేక్..

నందమూరి తారకరామారావు, జయప్రద జంటగా, తాతినేని రామారావు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా యమగోల. రావు గోపాలరావు, నిర్మలమ్మ, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య. ప్రభాకర్ రెడ్డి, సూర్యకాంతం లాంటి సీనియర్ తారలు నటించిన సినిమా యమగోల. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘యమగోల’ సినిమా 1977 అక్టోబర్ 21న రిలీజ్ అయ్యింది. త్వరలో 50 ఏళ్లు పూర్తి చేసకోబోతోంది. ఈసినిమా 1977 లో రిలీజ్ అయ్యింది కానీ అప్పటికి పదేళ్ల క్రితమే ఈ కథను తెరకెక్కించాలి అనుకున్నరట నిర్మాత, దర్శకుడు సీ. పుల్లయ్య. బెంగాలీ సినిమా కథను తీసుకుని రచయిత ఆదుర్తి నరసింహమూర్తితో తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా తిరిగి కథ రాయించారు . కానీ ఎందుకో ఆ కథను సినిమాగా తెరకెక్కించలేదు. ఈ కథ తయారు చేసిన కొంత కాలానికే పుల్లయ్య కాలం చేశారు. ఆతరువాత ఆ రైట్స్ ను పుల్లయ్య కొడుకు, ప్రముఖ దర్శకుడు సీఎస్ రావు నుంచి రామానాయుడు కొనుకున్నారు.

28
బాలకృష్ణ చేయాల్సిన సినిమా?

రామానాయుడు ఈ రైట్స్ ను కొన్నారు కానీ ఆయన కూడా సినిమా తియ్యలేదు. కొంత కాలానికి ఈ కథను రామానాయుడు దగ్గర నుంచి 5 వేల రూపాయలకు కెమెరామెన్ గా ఉన్న వెంకటరత్నం కొన్నారు. ఈమూవీని బాలకృష్ణ హీరోగా యమగోల సినిమా తెరకెక్కించాలని అనుకున్నారట. దానికి తగ్గట్టుగా నరసరాజుతో మరోసారి సినిమా కథను రాయించారు. అయితే అందులో ఎన్టీఆర్ చేత యముడి పాత్ర చేయించాలని కూడా ఫిక్స్ అయ్యారట టీమ్. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ కథ బాలకృష్ణ మోయలేడు, పైగా అతను హీరోగా నటిస్తే తమ సొంత బ్యానర్ నుంచి రావాలని పట్టు పట్టి, తానే హీరోగా యమగోల చేశారు. యముడిగా హీరోకు ఈక్వల్ పాత్రను కైకాల సత్యనారాయణకు ఈసినిమాలో ఇచ్చారు. అంతే కాదు అప్పటి వరకు కెమెరామెన్ గా ఉన్న వెంకటరత్నం.. పల్లవీ ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు.

38
యమగోల కథ విషయానికి వస్తే..

అనగనగా ఒక గ్రామం ఆ గ్రామానికి ప్రెసిడెంట్ సత్యం( ఎన్టీఆర్) స్థానిక భూస్వామి రుద్రయ్య( రావు గోపాలరావు) నిరంకుశత్వాన్ని, దుర్మార్గాన్ని ఎదిరిస్తూ.. గ్రామాన్ని కాపాడుతుంటాడు. జనాలకు ఎప్పుడు మంచి చేస్తుంటాడు. సత్యం రుద్రయ్య కుమార్తె సావిత్రి( జయప్రద)తో ప్రేమలో పడతాడు. గ్రామంలో ప్రతీ విషయంలో సత్యం తనకు అడ్డురావడం, తన పనిచేసుకోనివ్వకపోవడంతో పాటు, తన కూతురితో అతనికి ఉన్న సంబంధాన్ని తెలుసుకున్న రుద్రయ్య, సత్యాన్ని చంపడానికి ప్లాన్ వేస్తాడు. సాంప్రదాయ ఆచారం ముసుగులో సత్యాన్ని హత్య చేయడానికి అతను ప్రొఫెషనల్ కిల్లర్ రామ్ శాస్త్రి( ప్రభాకర్ రెడ్డి)ని నియమించుకుంటాడు. హత్య తర్వాత, రామ్ శాస్త్రి రుద్రయ్యతో... తన పూజ పూర్తయ్యే వరకు వెయిట్ చేయమని చెప్పి వెళ్లిపోతాడు. కానీ తెల్లారిపోతుండటంతో సమయం గడిచేకొద్దీ, రుద్రయ్యకు భయం వేస్తుంది, వెంటనే సత్యం మృతదేహాన్ని తన ఇంటి వెనుక ఖాళీ ప్లేస్ లో పాతిపెడతాడు.

నరకంలో విప్లవం తెచ్చిన హీరో 

సత్యం ఆత్మ ముందుగా స్వర్గానికి వెళ్తుంది. అక్కడ కొంత డ్రామా తరువాత అక్కడి నుంచి నరకానికి సత్యాన్ని తీసుకెళ్తారు. అక్కడ అనసూయమ్మత్త (సూర్యకాంతం) ను కలుస్తాడు సత్యం. ఇక అక్కడి అన్యాయాలు చూసి చలించిపోతాడు, రాక్షసుల శ్రమను చూసి తట్టుకోలేకపోతాడు. యముడు ( కైకాల సత్యనారాయణ) తో గొడవల కారణంగా గందరగోళానికి కారణమవుతాడు సత్యం. దాంతో నరకానికి లాక్డౌన్ పడుతుంది. దాంతో యముడు , చిత్రగుప్తుడు తిరిగి వచ్చినప్పుడు తాను తిరిగి రావాలని వాగ్దానంతో సత్యం కూడా తిరిగి భూలోకానికి వస్తాడు.

 

48
భూలోకంలో యముడు

యమగోల కథలో కొనసాగింపు:  యమలోకంలో ఎన్టీఆర్ అదంతా చేస్తుండగానే ఇంతలో, సత్యం అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు చేసి రుద్రయ్యను అనుమానించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు బతికి ఉన్న సత్యం, తన అనుచరుడు సుందరం వేషంలో రుద్రయ్య వద్దకు వెళ్తాడు. నిజం తెలియని రుద్రయ్య, సత్యంలా నటించడానికి సుందరంను నియమిస్తాడు. సుందరం రుద్రయ్యను ఎగతాళి చేయడం ప్రారంభిస్తాడు. ఇంతలో యముడు, చిత్రగుప్తుడు భూమిపైకి వచ్చి, ఇక్కడి విషయాలు అర్ధం అవ్వక నానా తిప్పలు పడుతుంటారు. అనేక సవాళ్లను ఎదుర్కొన్న తరువాత వారిని చివరికి పోలీసులు అరెస్టు చేస్తారు, కానీ సత్యం వారిని విడిపిస్తాడు. ఇక యముడు, చిత్రగుప్తుడిని పెట్టుకుని ఎన్టీఆర్ తన మామకు ఎలా బుద్ది చెప్పాడు, చివరకు ఎన్టీఆర్ ను యముడు పైకి తీసుకెళ్లాడా లేదా అనేది యమగోల సినిమా. ఈమూవీ ఈతరం ఆడియన్స్ ను కూడా అలరిస్తుంది.

58
యమగోల సినిమా రివ్యూ.

ప్రస్తుత కాలంలో సోషియో ఫాంటసీ సినిమాలు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. వాటికోసం ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నారో కూడా తెలుసు. ఇంత టెక్నాలజీ వాడినా కూడా నేటి ప్రేక్షకులను అలరించలేకపోతున్నారు మేకర్స్. కానీ ఒకప్పుడు అలా కాదు.. కథాబలంతో నవ్వించేవారు, ఏడిపించేవారు, సినిమాను సక్సెస్ రూట్ లోకి తీసుకెళ్లేవారు. అందుకు బెస్ట్ ఎక్జాంపుల్ ఆ కాలంలో నిర్మించిన సోషియో ఫాంటసీ సినిమాలు. అందులో యమగోల లాంటి సినిమాలు చాలా ప్రత్యేకం. యమలోకం ఒకటి ఉంటుంది అని ఊహించడం ఒక ఎత్తయితే.. ఆ లోకంలోనే రివల్యూషన్ తీసుకురావడం అనే ఆలోచన ఇంకా అద్భుతం. యమలోకంలో స్ట్రైక్ చేయడం ఏంటి, యమలోకం మూసేస్తే చనిపోయినవారంతా మళ్లీ భూమి మీదకు వచ్చేస్తారా? ఊహించుకుని కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది యమగోల కథ. ఈసినిమా ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్, జయప్రద లవ్ స్టోరీని చాలా అందంగా చూపించారు. ఎన్టీఆర్, జయప్రద మధ్య రొమాన్స్ కాస్త ఘాటుగానే అనిపిస్తుంది. ఆతరువాత విప్లవం పార్టును అంద్భుతంగా క్రియేట్ చేశాడు దర్శకుడు తాతినేని, ఆతరువాతి భాగంలో యముడిని అడ్డంపెట్టుకుని తన మామకు బుద్దిచెప్పడంతో కథ క్లైమాక్స్ కు చేరుతుంది. ఎక్కడ కొంచెం కూడా బోర్ కొట్టించకుండా, ప్రతీ సీన్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది యమగోల సినిమా. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ యమలోకం చేరుకున్నప్పటి నుండి సినిమా గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. ఇక పాటలయితే.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాను ఆ పాటలను వేరు చేసి చూడలేము. అంత అద్భుతంగా ఈ సినిమాకు అవి వర్కౌట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా అప్పటి పాలిటిక్స్ పై సినిమాలో వేసిన సెటైర్స్ ను కూడా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.

68
ఎన్టీఆర్ దెబ్బకు జయప్రదకు జ్వరం

ఈసినిమాలో నటీనటులలో ఎవరినీ అలా తీసి పక్కన పెట్టలేము. అందరు అద్భుతాలే చేశారు. మరీ ముఖ్యంగా సత్యం పాత్రలో ఎన్టీఆర్ నటన చాలా ప్రత్యేకంగా చెప్పాలి. తన కొడుకు చేయాల్సిన పాత్రను.. ఎన్టీఆర్ ఆ ఏజ్ లో కూడా అద్భుతంగా పోషించగలిగారు. ప్రేమికుడిగా, సమాజ సేవకుడిగా, మామకు బుద్దిచెప్పే కొంటె అల్లుడిగా, యముడిని ఎదిరించిన ధీరుడిగా, ఇలా ఎన్టీఆర్ లో ఎన్నో వేరియేషన్స్ కనిపించాయి. ఇక యమగోల సినిమాకు జయప్రద అందం ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. అందానికి ఆమె నటనతోడై సినిమా మరింత అద్భుతంగా వచ్చింది. పాటలో ఎన్టీఆర్ కు పోటీగా జయప్రద డాన్స్ చేసింది. ఎన్టీఆర్ ఎనర్జీని తట్టుకోవడం అంటే మాటలు కావు. ఓ సందర్భంలో జయప్రద ఈ విషయాల గురించి మాట్లాడారు. యమగోల సినిమాలో ఓలమ్మీతిగ్గరేగిందా పాటకోసం ఎన్టీఆర్ జయప్రదను ఛాన్స్ దొరికినప్పుడల్లా కొడుతుంటాడు. ఆయన దెబ్బలకు తట్టుకోలేక జయప్రదకు జ్వరం వచ్చేసిందట, ఈ సినిమా షూటింగ్ తరువాత ఒళ్లు నొప్పులతో 3 రోజులు మంచ్చమెక్కేశారట. ఈ విషయం జయప్రద స్వయంగా వెల్లడించారు. ఇక యముడిగా కైకాల సత్యనారాయణ చాలా హుందాగా నటించారు. చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్యల కామెడీ కడుపుబ్బా నవ్వించింది. మరీ ముఖ్యంగా వాళ్లు భూలోకం వచ్చిన తర్వాత జరిగే సీన్స్ అయితే హైలెట్. ఇక ఈసినిమాలో విలన్ గా రావుగోపాలరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రూరత్వంతో కూడిన విలనిజం చూపించడం ఆయనకు కొత్తేమీ కాదు. ఇక నిర్మలమ్మ, ప్రభాకర్ రెడ్డి, సూర్యాకాంతం లాంటి సీనియర్ తారలు వాళ్ల పాత్రల పరిదిమేరకు నటించి మెప్పించారు.

78
ఎవర్ గ్రీన్ గా నిలిచిన యమగోల పాటలు

టెక్నికల్ గా చూసుకుంటే ఈసినిమాను నడిపించిన కెప్టెన్ తాతినేని రామారావుకు ఈసినిమా క్రెడిట్ అంతా ఇచ్చేయొచ్చు. ఎందుకంటే కథను అద్భుతమైన సినిమాగా తీర్చిదిద్దేది దర్శకుడే. అందులో లోపం జరిగితే, ఎంత అద్భుమైన కథ అయినా సినిమాగా డిజాస్టర్ చూడాల్సిందే. తాతినేని ఈ విషయంలో అద్భుతమే చేశారు. తెలుగు ప్రేక్షకుల నాడికి తగ్గట్టు మంచి స్క్రీన్ ప్లే ను రాసుకున్నారు. దానికి తగ్గట్టుగా ఆడియన్స్ ఎంజాయ్ చేసేవిధంగా, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఎలిమెంట్స్ ను యాడ్ చేసుకుంటూ వెళ్లారు. ఇక ఈసినిమా విజయంలో పాటల పాత్ర చాలాప్రత్యేకం. ఇప్పుడు విన్న చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి యమగోల పాటలు. చక్రవర్తి సంగీతంలో ఏదో మ్యాజిక్ ఉంది. అందకే ఆయన మ్యూజిక్ తెలియని గమ్మత్తైన మత్తునిస్తుంది. ఈసినిమాలో ‘చిలక కొట్టుడు కొడితే చిన్నదానా’, ‘వయసు ముసురుకొస్తున్నది’ ఓలమ్మీ తిక్కరేగిందా’, ‘గుడివాడ వెళ్లాను.. గుంటూరు పోయాను’, ‘ఆడవె అందాల సురభామిని’, ‘సమరానికి నేడే ప్రారంభం’, సాంగ్స్ వినడానికి ఎంతో హాయిగా అనిపిస్తాయి. చక్రవర్తి సంగీతానికి ఎప్పీ బాలు గొంతు తోడే.. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈసినిమాతో వెంకటరత్నం నిర్మాతగా మారాడు, కాబట్టి ఆయన సినిమాకు ఆయనే జాగ్రత్తగా కెమెరా వర్క్ చేసుకున్నారు.

88
యమగోల విజయం

యమగోల సినిమా షూటింగ్ అంతా దాదాపు వాహినీ స్టూడియోలోనే జరిగింది. ఈసినిమా కోసం వాహినీలో ప్రత్యేకంగా యమలోకం సెట్ కూడా వేశారు. ఇక సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్టయింది. మరీ ముఖ్యంగా యమలోకంలో జరిగే సీన్స్ కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, ప్రతీ సన్నివేశానికి బ్రహ్మాండంగా రియాక్టయ్యారు. యమగోలకు బ్రహ్మరథం పట్టారు. ఈసినిమా డైలాగ్స్ తో వచ్చిన గ్రామ్ ఫోన్ రికార్డులు తెగ అమ్ముడుపోయాయి. ఎవరి నోట విన్నా యమగోల డైలాగ్స్ మాత్రమే వినిపించేవి. చిత్రగుప్తా.. పెట్టెకు తాళం వేయలేదా? తాళము వేసితిని, గొళ్లెము మరచితిని" డైలాగ్ విపరీతంగా జనంలోకి వెళ్ళింది. ఇప్పటికీ చాలా మంది ''తాళము వేసితిని, గొళ్లెము మరచితిని డైలాగ్ ను సామెతగా వాడుతుంటారు. ఇక ఈసినిమా మొదటిసారి నిర్మాతగా మారిన వెంకటరత్నానికి లాభాలు తీసుకొచ్చింది. ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఇక ఈమూవీ ఇప్పటి జనరేషన్ యువత కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఇక యమగోల సినిమా చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories