`డ్యూడ్` మూవీ రివ్యూ, రేటింగ్‌.. ప్రదీప్‌ రంగనాథన్‌ హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడా?

Published : Oct 17, 2025, 04:53 PM IST

ప్రదీప్‌ రంగనాథన్‌ తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఆయన తాజాగా `డ్యూడ్‌` చిత్రంతో మన ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆకట్టుకుందా? రివ్యూలో చూద్దాం. 

PREV
16
`డ్యూడ్‌` మూవీ రివ్యూ

`లవ్‌ టుడే`, `డ్రాగన్‌` చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు తమిళ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌. ఈ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టేందుకు `డ్యూడ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగులోనూ ఏక కాలంలో నేడు శుక్రవారం(అక్టోబర్‌ 17న)న విడుదలైంది. ఇందులో `ప్రేమలు` హీరోయిన్‌ మమితా బైజు హీరోయిన్‌గా నటించడం విశేషం. తెలుగు ప్రొడక్షన్‌ హౌజ్‌ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు. గత రెండు చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన ప్రదీప్‌ రంగనాథన్‌ మూవీ కావడంతో `డ్యూడ్‌` చిత్రంపై తెలుగులో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రసాద్‌ ఐమాక్స్ ఈ సినిమాని మీడియాతో వీక్షించాను. మరి ఈ చిత్రంతోనూ ప్రదీప్‌ ఆకట్టుకున్నాడా? హ్యాట్రిక్‌ కొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
`డ్యూడ్‌` మూవీ కథ ఏంటంటే?

గగన్‌(ప్రదీప్‌ రంగనాథన్‌)ని సొంత మరదలు కుందన(మమిత బైజు) ప్రేమిస్తుంది. చిన్నప్పట్నుంచి చూస్తూ పెరగడం, ఆడుకోవడంతో మరదలిని ప్రేమ కోణంలో చూడలేదంటాడు గగన్‌. ఆ తర్వాత మరదలు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతాడు. మళ్లీ ఆమెకి దగ్గర కావాలనుకుంటాడు. అదే సమయంలో కుందన తండ్రి (శరత్‌ కుమార్‌) కూతురుకి పెళ్లి చేయడానికి రెడీ అవుతాడు. బయట వాళ్లకి ఎందుకు సొంత అల్లుడికే ఇస్తే బెటర్ అని అడగడంతో మరో మాట లేకుండా ఓకే చెబుతాడు గగన్‌. పెళ్లికి అంతా సిద్ధమవుతుంది. ఆ సమయంలో కుందనని కలిసేందుకు గగన్‌ వెళ్లగా, ఈ పెళ్లి ఇష్టం లేదని కుందని చెబుతుంది. ఆమె పార్థు అని మరో వ్యక్తిని ప్రేమిస్తుంది. గగన్‌ రిజెక్ట్ చేయడంతో ఆ బాధలో పార్థుకి కనెక్ట్ అవుతుంది. తండ్రికి ఈ విషయం చెప్పగా, ఆయన బెదిరిస్తాడు. దీంతో చేసేదేం లేక గగన్‌తో పెళ్లికి రెడీ అవుతుంది. మధ్యలో ప్రియుడితో పారిపోవాలని ప్లాన్‌ చేసినా అన్ని రకాలుగా అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి గగన్‌తో పెళ్లి అయిన తర్వాత విదేశాలకు పారిపోవాలనుకుంటారు. ఎట్టకేలకు గగన్‌ని పెళ్లి చేసుకుంటుంది కుందన. ఆ తర్వాత ప్రియుడితో కలిసి కెనడా వెళ్లిపోవాలనుకుంటారు. కానీ ఆమె ప్రెగ్నెంట్‌ అని తేలుతుంది. దీంతో అంతా షాక్‌. మరి కుందనలో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? ప్రియుడా? గగనా? ఆ తర్వాత ఏం జరిగింది? గగన్‌ తన ప్రేమని కుందని చెప్పడా? గగన్‌ కోసం కుందన ఏం చేసింది? అనేది మిగిలిన సినిమా.

36
`డ్యూడ్‌` మూవీ విశ్లేషణ

ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా వస్తోన్న మూవీ అంటే ఆడియెన్స్ లో ఒక మినిమమ్‌ గ్యారంటీ అనేది ఏర్పడింది. మంచి కంటెంట్‌ ఉంటుందని, ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని, క్రేజీగా ఉంటుందనే టాక్‌ ఉంది. `డ్యూడ్‌` మూవీ విషయంలో మరోసారి అదే చాటిచెప్పాడు. ఇదొక క్రేజీ సబ్జెక్ట్. అల్లు అర్జున్‌ `ఆర్య` సినిమా మాదిరిగా ఉంటుంది.హీరోయిన్‌ని హీరో ప్రేమించడం, హీరోయిన్‌ వేరే అబ్బాయిని ప్రేమించడం, వాళ్ల ప్రేమని కలపడం కోసం హీరో త్యాగం చేయడమే ఈ చిత్ర కథ. తమ ప్రియురాలు హ్యాపీగా ఉండటం కోసం తాను అన్ని రకాల స్ట్రగుల్స్ ఫేస్‌ చేయడమే సినిమా. అయితే ఇందులో ప్రేమ వరకే కాదు, పెళ్లి, పిల్లల వరకు వెళ్లడమే క్రేజీ పాయింట్‌గా చెప్పొచ్చు. ఈ విషయం ఫస్టాఫ్‌లోనే తెలిసిపోతుంది. ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడం, ప్రియుడితో లేచిపోయేందుకు భర్తనే సపోర్ట్ చేయడం, కానీ పరిస్థితులు తలక్రిందులవడం, వాటిని హీరో ఫేస్‌ చేయడం చాలా క్రేజీగా ఉంటుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. దానికితోడు ప్రదీప్‌ తన మార్క్ నటన, కామెడీతో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌ అంతా కన్‌ఫ్యూజన్‌ కామెడీగా సాగుతుంది. సెకండాఫ్‌ లో కుందన ప్రెగ్నెంట్‌ కావడం, ఆయా పరిస్థితులను మెయింటేన్‌ చేయడం, దాన్ని హీరో డీల్‌ చేయడం, చివరికి కుందన బిడ్డకి కూడా జన్మనివడంతో ఆ బిడ్డకి తండ్రి ఎవరనేది మ్యానేజ్‌ చేయడం నాటకీయంగా సాగుతుంది. ఫన్నీగా వెళ్లుంది. క్లైమాక్స్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్ వరకు సరదాగా వెళ్లిన కథ, ఆ తర్వాత ఎమోషనల్ గా టర్న్ తీసుకుంటుంది. హీరో పాత్రలోని ఎమోషన్‌ ఆకట్టుకుంటుంది.

46
`డ్యూడ్‌` మూవీ హైలైట్స్, మైనస్‌లు

సినిమా ప్రారంభం నుంచి ఫన్నీగా సాగడం ఇందులో హైలైట్‌. ప్రదీప్‌ రంగనాథన్‌ పాత్ర నుంచి పుట్టే కామెడీ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌, అందులోని ట్విస్ట్ లు, విచిత్రమైన పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం కూడా నవ్వులు పూయిస్తుంది. తండ్రి ఎవరనేది? క్రేజీగా ఉంటుంది. ఇవన్నీ ఇందులో హైలైట్‌గా నిలిచాయి. మరోవైపు శరత్‌ కుమార్‌ చేసే సీరియస్‌ ఫ్రాంక్‌లు కూడా నవ్విస్తాయి. కాకపోతే ఫస్టాఫ్‌ లో ఉన్న ఫన్‌ సెకండాఫ్‌లో లేదు. పైగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో కథని నడిపించిన తీరు కూడా కన్విన్సింగ్‌గా ఉండదు. కొంత డిస్టర్బెన్స్ గా ఉంటుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉన్నా, ముగింపు మాత్రం ఏదైనా కొత్తగా ఉంటుందనుకున్న ఆడియెన్స్ కి నిరాశ తప్పదు. కానీ అలా లేకపోవడంతో కొంత నిరాశ కలుగుతుంది. ఏదేమైనా సినిమా ఫన్‌ వరకు బాగుంది. ఫస్టాఫ్‌లో ఫన్‌, సెకండాఫ్‌ లో డ్రామా మెప్పిస్తాయి.

56
`డ్యూడ్‌` మూవీ నటీనటుల ప్రదర్శన

గగన్‌ పాత్రలో ప్రదీప్‌ రంగనాథన్‌ అదరగొట్టాడు. సినిమాని మోసేశాడు. రెచ్చిపోయి నటించాడు. తను స్ట్రగుల్‌ అవుతూ నవ్వులు పూయించిన తీరు బాగుంది. చాలా నేచురల్‌గా యాక్ట్ చేసి మెప్పించాడు. ఎమోషనల్‌ సీన్లలో అదగొట్టాడు. ఇక కుందనగా మమిత బైజు బాగా చేసింది. పాత్రలో జీవించింది. విభిన్నమైన ఎమోషన్స్ ని పలికించి ఆకట్టుకుంది. హీరోయిన్‌ తండ్రిగా శరత్‌ కుమార్‌ నటన సైతం ఆకట్టుకుంటుంది. ఆయన ఫ్రాంక్‌ల పేరుతో చూపించిన వేరియేషన్‌ వాహ్‌ అనిపిస్తుంది. కుందన ప్రియుడు సైతం బాగా చేశారు. సత్య, నేహా శెట్టి వంటి ఇతర పాత్రధారులు కూడా అలరించారు.

66
`డ్యూడ్‌` మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

నికేత్‌ బొమ్మి కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. భరత్‌ విక్రమన్‌ చాలా బాగా డీల్‌ చేశాడు. సెకండాఫ్‌లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సాయి అభ్యంకర్‌ సంగీతం బాగుంది. పాటలు అలరించేలా ఉన్నాయి. ఆర్‌ఆర్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. సినిమాకి హైలైట్‌గా నిలిచింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. మైత్రీ మూవీ మేకర్స్ బాగా తీశారు. దర్శకుడు కీర్తిశ్వరన్‌ దర్శకత్వం సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. ఇలాంటి సబ్జెక్ట్ ని డీల్‌ చేయడం చాలా టఫ్‌ జాబ్‌. ఎలా చూపించారు, ఏం చూపించాలనేది పెద్ద కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్‌ అయినా, సెకండాఫ్‌లో మాత్రం కాస్త తడబాటు కనిపిస్తోంది. కన్‌ఫ్యూజన్‌ కనిపిస్తుంది. కథని తిప్పి తిప్పి తీసుకెళ్లినట్టుగా ఉంటుంది. కొంత ల్యాగ్‌ ఉంటుంది. దీంతో బోర్‌ ఫీల్‌ తెప్పిస్తుంది. మరికొన్ని సార్లు రొటీన్‌ ఫీల్‌ తెప్పిస్తాయి. మొదటి భాగం మాదిరిగానే సెకండాఫ్‌ని డీల్‌ చేస్తే సినిమా అదిరిపోయేది. అయినప్పటికీ సినిమా ఎంగేజ్‌ చేస్తుంది. కొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుంది.

ఫైనల్‌గాః క్రేజీ కాన్సెప్ట్ తో నవ్వించే `డ్యూడ్‌`

రేటింగ్‌ః 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories