Razor Movie Review: రేజర్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. రవిబాబు అన్నీ తానై చేసిన మూవీ ఎలా ఉందంటే?

Published : May 08, 2026, 03:11 PM IST

రవిబాబు హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా మారి చేసిన చిత్రం `రేజర్‌`. తనలోని కొత్త యాంగిల్‌ని పరిచయం చేస్తూ రూపొందించిన ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
15
రవిబాబు రేజర్‌ మూవీ రివ్యూ

రవిబాబు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్‌గా ఇలా  తన మల్టీటాలెంట్‌ని చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే దర్శకుడిగా ఆయన సక్సెస్‌ కాలేకపోతున్నారు. విభిన్నమైన కథా నేపథ్యంతో కూడిన సినిమాలు చేసినా, అవి బాక్సాఫీసు వద్ద ఆదరణ పొందలేకపోతున్నాయి. ఈ క్రమంలో రవిబాబు తాజాగా హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన మూవీ `రేజర్‌`. యాక్షర్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో తనీష్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(మే 8)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? రవిబాబు ఈ సారైనా హిట్‌ కొట్టాడా అనేది చూస్తే.

25
రేజర్‌ మూవీ కథ ఏంటంటే?

సీఎంని చంపి తాను సీఎం కావాలని కుట్ర పన్నుతాడు హోంమంత్రి. కానీ అది సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. ఆ సీసీ కెమెరా బిజినెస్‌ చేసే విష్ణు(తనీష్‌) అది చూసి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాలనుకుంటాడు. కానీ ఫ్రెండ్‌ వద్దు, సమస్య వస్తుందని చెబుతాడు. అంతలోనే ఈ విషయం హోంమంత్రికి తెలుస్తుంది. దీంతో ఆ ఫ్రెండ్‌ని చంపేసి, విష్ణు, అతని భార్య(ఇనయా సుల్తానా)ని కూడా చంపేస్తాడు. విష్ణు కూతురు తేజు ఆ హంతకులను చూస్తుంది. దీంతో ఆ పాపని చంపేసి, ఆ సీసీ టీవీ ఫూటేజీని తీసుకురావాలని తన మనుషులను ఆదేశిస్తాడు హోంమంత్రి. కానీ అప్పటికే విష్ణు ఆ ఫూటేజీని వేర్వేరు చోట్ల సీక్రెట్‌గా ఉంచుతాడు. దానికి ఒక కోడ్‌ సిస్టమ్‌ని వాడతాడు. చనిపోయే ముందు కూతురుకి గోల్కొండ అనే పేరు చెబుతాడు. తేజు పెట్‌ డాగ్‌ని బాత్‌ చేయడానికి డాగ్‌ సర్వీస్‌ చేసే రుద్ర(రవిబాబు) వస్తాడు. డాగ్‌ బాత్‌ చేయించి వచ్చే లోపే విష్ణు, అతని భార్య చనిపోయి ఉంటారు.  తేజు ఏడుస్తుంది. ఆ పాపని రుద్ర కాపాడతాడు. ఆమెకి రక్షణగా ఉంటాడు. దీంతో హోంమంత్రి మనుషులు రుద్రని వెతుకుతుంటారు. వారి నుంచి తప్పించుకుంటూ విష్ణు దాచిన వీడియోలను డీకోడ్‌ చేసుకుంటూ వెళ్తుంటాడు. మరి ఆ వీడియోని విష్ణు ఎక్కడ దాచాడు? తేజుని కాపాడటం కోసం ఏం చేశాడు? ఇంతకి రుద్ర ఎవరు? అతని బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి? తనతో పనిచేస్తున్న వాళ్లు ఎవరు? హోంమంత్రి సీఎం అయ్యాడా? అసలేం జరిగిందనేది మిగిలిన కథ.

35
రేజర్‌ మూవీ ఎలా ఉందంటే?

రవిబాబు చిన్న టాపిక్‌ని పట్టుకుని దాని చుట్టూ కథలు అల్లుకుంటూ సినిమాలు చేస్తుంటారు. థ్రిల్లర్స్, హర్రర్‌ థ్రిల్లర్స్ చేయడంలో ఆయన ఎక్స్ పర్ట్. కాకపోతే అలాంటి చిత్రాలు ఆడటం లేదు. ఇప్పుడు  కొత్త పంథాని ఫాలో అయ్యాడు. పూర్తిగా రూట్‌ మార్చి యాక్షన్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ చేశారు. `మార్కో`, `కిల్‌` మూవీస్‌ తరహాలో శ్రుతి మించిన వాయిలెన్స్  ప్రధానంగా స్టయిలీష్‌ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కించాడు. తెలుగులో ఈ తరహా యాక్షన్‌తో కూడిన సినిమాలు రాలేదని చెప్పొచ్చు. ఇందులో ఇదే కొత్తదనం అని చెప్పాలి. మిగిలినదంతా రొటీన్‌గానే సాగుతుంది. రెగ్యూలర్‌ రవిబాబు సినిమాలను తలపిస్తుంది. యాక్షన్‌ ఎపిసోడ్‌ విషయంలో బౌండరీలు బ్రేక్‌ చేసి ఈ మూవీని రూపొందించారు. అయితే ఆయా యాక్షన్‌ సీన్లు కూడా వేరే లెవల్‌లో ఉన్నాయి. ఆయా సీన్లు చూస్తుంటే విజిల్స్ వేయకుండా ఉండలేదు. రవిబాబు నుంచి ఇలాంటి మూవీ అనేసరికి క్రేజీగా ఉంటుంది. సినిమా మొత్తంలో ఈ సీన్లు బాగా ఆకట్టుకుంటాయి. ఇక సీసీ టీవీ ఫూటేజీ కోసం చేసే సెర్చింగ్‌, రొటీన్‌గానే ఉంటుంది. కొన్ని చోట్ల ఎంగేజింగ్‌గా ఉన్నా, పెద్దగా ఆ ఇంపాక్ట్ ఉండదు. ఫస్టాఫ్‌.. హోంమంత్రి..సీఎంని చంపడం, ఆయన సీఎం కావడం కోసం చేసే ప్రయత్నాలు ఓ వైపు.. సీసీ టీవీ ఫూటేజీని వెతికే ప్రక్రియ మరోవైపుతో సాగుతుంది. ఫస్టాఫ్‌ కొంత వరకు ఫర్వాలేదనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌ మరి స్లోగా, రొటీన్‌గా సాగుతుంది. వీడియో కోసం వెతకడం చుట్టూనే సాగుతుంది. మరోవైపు రవిబాబుని చంపేయడం కోసం హోంమంత్రి మనుషులు వెతకడం, ఆ తర్వాత వచ్చే యాక్షన్‌ సీన్లు ఫర్వాలేదనిపించాయి. కాకపోతే మొదటి యాక్షన్‌ ఎపిసోడ్‌ తర్వాత ఆ స్థాయిలో లేవనే చెప్పాలి. మరోవైపు వీడియో కోసం వెతికే సన్నివేశాలు కూడా రెగ్యూలర్‌గా, స్లోగా సాగుతూ సహనాన్ని పరీక్షిస్తుంటాయి. ఏమాత్రం కొత్తగా, ఆకట్టుకునేలా లేవు. అయితే ఇందులో రవిబాబు ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ కొంత కదిలించేలా ఉంటుంది. క్లైమాక్స్ ఊహించినట్టుగానే సాగుతుంది. సినిమా మొత్తంలో రవిబాబు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు, తనకు ఎలివేషన్లు ఇచ్చుకున్నాడు, కానీ మిగిలినదంతా రొటీన్‌ ఫార్మూలా లాగే సాగిందని చెప్పొచ్చు. బీజీఎం మాత్రం ఆకట్టుకుంది.

45
రేజర్‌ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

రుద్ర ప్రతాప్‌గా రవిబాబు రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. యాక్షన్‌ సీన్లలో దుమ్ములేపాడు. నటుడిగానూ సెటిల్డ్ గా నటించాడు. కానీ ఆయన్ని చాలా వరకు విలన్‌గా చూసిన నేపథ్యంలో ఇందులో హీరోగా డైజెస్ట్ చేసుకోవడం కొంత కష్టంగానే ఉంటుంది. ఎమోషనల్‌ సీన్లలో బాగా చేశాడు రవిబాబు. తేజుగా చేసిన పాప అదరగొట్టింది. ఆమె చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. తేజు తండ్రిగా తనీష్‌ కనిపించాడు. ఉన్నది కాసేపే అయినా తన ఇంపాక్ట్ ని చూపించాడు. తన బ్యాచ్‌ కుర్రాళ్లు, హోంమంత్రిగా చేసిన నటుడు, ఇతరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

55
రేజర్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమా విజువల్‌గా బాగుంది. ప్రొడక్షన్స్ పరంగా క్వాలిటీగా ఉంది. ఎడిటింగ్‌ పరంగా బాగా కేర్‌ తీసుకోవాల్సింది. దర్శకుడిగా రవిబాబు యాక్షన్‌ సీన్ల విషయంలో కొత్తగా ప్రయత్నించాడు, కానీ మిగిలినదంతా తన ఓల్డ్ ఫార్మాట్‌లోనే వెళ్లాడు. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ ఫర్వాలేదు. టేకింగ్‌ పరంగా ఇంకా బాగా వర్క్ చేయాల్సింది.  స్పీడ్‌గా సినిమాని నడిపించాల్సింది. ఆ విషయంలో తడబడ్డాడు. సినిమాకి బిజిఎం హైలైట్‌గా నిలుస్తుంది చెప్పొచ్చు.

ఫైనల్‌గా

 యాక్షన్‌ సీన్లలో ఊచకోత తప్పితే, మిగిలినదంతా రొటీన్‌, బోరింగ్‌గా సాగే క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ రేజర్‌.

రేటింగ్‌:  2

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories