మూగమనసులు రివ్యూ.. సావిత్రి ప్రాణాలు కాపాడిన అక్కినేని నాగేశ్వరరావు, కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలవడానికి కారణం ఏంటి?

Published : Nov 16, 2025, 09:27 AM IST

Mooga Manasulu Review అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమునల కాంబినేషన్ లో వచ్చిన అద్భుత చిత్రాల్లో మూగమనసులు ఒకటి. పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన ఈసినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.  60 ఏళ్లు పూర్తి చేసుకున్న మూగమనసులు రివ్యూ మీకోసం. 

PREV
17
60 ఏళ్లు పూర్తి చేసుకున్న మూగమనసులు

అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి జంటగా.. కథను మలుపు తిప్పే పాత్రలో జమున నటించిన సినిమా మూగమనసులు. ఆదుర్తి సుబ్బారాబు డైరెక్టర్ చేస్తూ.. నిర్మించిన ఈసినిమా 1964 లో రిలీజ్ అయ్యి.. సంచలన విజయం సాధించింది. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న మూగమనసలు సినిమాలో గుమ్మడి,సూర్యాకాంతం, పద్మనాభం, నాగభూషణం, అల్లు రామలింగయ్య లాంటి తారలు నటించి మెప్పించారు. ఈసినిమా.. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. ఆదుర్తితో పాటు, ఆత్రేయ, దాశరథి, కొసరాజు, ముళ్లపూడి వెంకట రమణ లాంటి మహానుభావులెందరో ఈసినిమా కోసం పనిచేశారు. అద్భుతమైన కథ,కథనాలతో రూపొందిన మూగమనసులు తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయింది.

27
మూగమనసులు కథలోకి వెళ్తే..

గోపీనాథ్ ( అక్కినేని నాగేశ్వరావు), రాధ(సావిత్రి) కొత్త దంపతులు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకుని.. హనీమూన్ కోసం బయలుదేరడంతో కథ స్టార్ట్ అవుతుంది. గోదావరిలో పడవ ప్రయాణిస్తుండగా కొద్ది దూరంలో సుడిగుండాలు కనిపిస్తాయి. వాటిని చూడటంతో.. గోపీకి, రాధకు గత జన్మ జ్ఞాపకాలు తొలిచివేస్తాయి. దాంతో పడవను ఆపమని గోపీనాథ్, రాధ అరుస్తారు. దాంతో పడవను ఒక ఒడ్డుకు తీసుకెళ్లి ఆపుతాడు సరంగు. ఆ ఒడ్డుకు కొద్ది దూరంలో ఓ పాడుబడిని బంగ్లా కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే.. గోపీ,రాధలకు గత జన్మ జ్ఞాపకాలు మళ్లీ వస్తాయి. ఓ ముసలివాడు ఆ బంగ్లా గురించి వారికి చెపుతాడు. అది జమిందారు బంగ్లా అని చెప్పి.. అక్కడే ఉన్న రెండు సమాధుల దగ్గరకు తీసుకెళ్తాడు. ఆరెండు సమాధుల దగ్గర దీపాలు వెలిగిస్తూ..ఓ ముసలావిడి కనిపిస్తుంది. ఆమె పేరు గౌరి( జమున). ఆమె గోపీని,రాధను చూసి.. వారే గత జన్మలో ప్రేమికులు అని చెప్పి.. వారికి ప్లాష్ బ్యాక్ లో ఏంజరిగిందో వివరిస్తుంది.

37
పునర్జన్మల నేపథ్యంలో కథ

గత జన్మలో వారిద్దరూ జమీందారు గారి అమ్మాయిగానూ, బల్లకట్టు గోపిగానూ జన్మించినట్టు తెలుస్తుంది. ఆ జన్మలో, అమ్మాయి గారూ అంటూ ఆప్యాయంగా బల్లకట్టు గోపి ఆమెను పిలిచేవాడు. ఆమె కాలేజీకి వెళ్ళడానికి రోజు తన బల్లకట్టులో గోదావరి దాటించేవాడు. వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి అభిమానం ఉన్నా.. అతను పేదవాడు కావడం, తక్కువ కులస్తుడు కావడంతో.. ఒకరిపై ఒకరు ఇష్టాన్ని చెప్పకోలేకపోతారు. ఇక గోపీని తని వాడలోనే ఉండే పల్లెపిల్ల గౌరి( జమున) ప్రేమిస్తూంటుంది. కాలేజీలో సావిత్రిని మరో డబ్బున్న కుర్రాడు ప్రేమిస్తుంటాడు.

డబ్బున్న కుర్రాడు రాధ వెంటపడటం చూసి.. గోపీ అతడిని కొడతాడు.. ఈ విషయం పెద్దలకు తెలిసి.. ఆ డబ్బున్న కుర్రాడితోనే రాధకు పెళ్లి చేస్తారు. ఆ వివాహం జరిగిన కొన్నాళ్ళకే భర్త చనిపోయి హీరోయన్ తిరిగి పుట్టింటికి చేరుతుంది. కొన్నాళ్ళకు గోపీ-రాధ మీద ఊళ్ళో పుకార్లు చెలరేగుతాయి. చివర్లో వాళ్ళిద్దరూ ఆ ఊరు వదిలి వెళ్లిపోవాలని బల్లకట్టుపై బయలుదేరుతారు. వీరిద్దరు వెళ్లడానికి గౌరి చాలా పెద్ద త్యాగం చేస్తుంది. కానీ ఆమె త్యాగం వృధా అవుతుంది. బల్లకట్టు వరద గోదారి ఉధృతిలో మునిగిపోయి.. గోపీ, అమ్మాయిగారూ మరణిస్తారు. ఆ తర్వాతి జన్మలో ఏమౌతుంది అనేది మూగమనసులు సినిమా కథ. ఈ కథ అంతా అప్పటికే వృద్ధురాలైన గౌరీ వాళ్లిద్దరికీ చెప్తుంది.

47
మూగమనసులు సినిమా రివ్యూ..

60 ఏళ్ళ క్రితం వచ్చిన ఈసినిమా అద్భుతమైన కథతో తెరకెక్కింది. సినిమాలో ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడి మనసును తాకేలా తెరకెక్కించారు దర్శకుడు ఆదుర్తి. అప్పట్లో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న పేద, ధనిక అంతరాలను.. ప్రేమ అనే ఎమోషన్ కు జోడించి అద్భుతమైన కథను తీర్చిదిద్దారు. హీరో హీరోయిన్లు పెళ్లై హనీమూన్ కు వెళ్లడం దగ్గర సినిమా స్టార్ట్ అవుతుంది.. అక్కడి నుంచి.. వారిని ప్లాష్ బ్యాక్ సీన్ లోకి తీసుకెళ్లడం.. అది కూడా గతంలో వారు ఎలా మరణించారో.. సరిగ్గా అదే ప్లేస్ లో.. వారికి ఆ జ్ఞాపకాలు గుర్తుకు రావడం లాంటి సన్నివేశాలు.. ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ప్లాష్ బ్యాక్ లో ఏఎన్నార్, సావిత్రి మూగ ప్రేమ ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. సావిత్రి కి మరో పెళ్లి జరగడం, భర్త మరణించడం.. ఇలా కొంత వరకూ సినిమా ఆడియన్స్ చేత కంటతడిపెట్టిస్తుంది మధ్య మధ్యలో ఆత్రేయ సాహిత్యంలో, మహదేవన్ సంగీతం అందించిన పాటలు.. మనసును కరిగించివేస్తాయి. ఈసినిమాలో జమున చేసిన గౌరిపాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈసినిమాలో హీరో, హీరోయిన్ ను మించి ఇమేజ్ గౌరి పాత్రకు వచ్చింది. అంత అద్భుతంగా ఆ పాత్రను డిజైన్ చేశారు.

57
నటీనటులు, టెక్నీషియన్స్..

మూగమనసులు సినిమా అంతా అక్కినేని, సావిత్రి, జమునల చుట్టు తిరుగుతుంది. ఈసినిమాలో రెండు పాత్రల్లో అక్కినేనినటన అద్భుతం అని చెప్పాలి. పడవనడిపే అమాయకపు గోపీ పాత్రలో ఏఎన్నార్ ఎంతో అద్భుతంగా నటించారు. ఇక రాధ పాత్రలో సావిత్రి ఒదిగిపోయారు. మంచి మనసున్న జమందారు కూతురిగా.. సావిత్రి నటన, ఎమోషనల్ సీన్స్ లో ఆమె హావభావాలు ఆడియన్స్ మనసుని తాకాయి. ఇక పట్టలె టూరి గూడెం పిల్ల గౌరిగా జమున పాత్ర అందరికి ఆకట్టుకుంటుంది. గడసు పాత్రలు చేయడంలో జమున తరువాతే ఎవరైనా.. ఆపాత్ర కోసం ఎంత మంది హీరోయిన్లు పోటీ పడ్డా.. దర్శకుడు ఆదుర్తి, హీరో ఏఎన్నార్ మాత్రం జమున మాత్రమే.. ఈ క్యారెక్టర్ చేయాలని పట్టుబట్టి తీసుకున్నారట. ఈ విషయాన్ని జమున ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక జమిందారుగా గుమ్మడి తన పాత్రకు న్యాయం చేశారు. సూర్యకాంతం, పద్మనాభం, అల్లు, నాగభూషణం తమ పాత్రల పరిధిమేరకు అద్భుతంగా నటించారు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా పడవకు కెప్టెన్ గా ఆదుర్తి తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఆయన చేసిన సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువ. ఈసినిమా కూడా ఆదుర్తి మార్క్ తో కనిపిస్తుంది. ఇక ముళ్లపూడి వెంకట రమణ, ఆత్రేయ మాటలు, కేవీ మహదేవన్ పాటలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గోదారి గట్టుంది.. గట్టుమీద చెట్టుంది పాటతో పాటు ఈనాటి ఈ బంధం ఏనాటితో, ముద్దబంతి పువ్వులో మూగకళ్ల ఊసులు, పాడుతా తీయ్యగా చల్లగా, నా పాట నీ నోట పలకాల సిలకా.. లాంటి పాటలు మూగమనసులు సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించాయి.

67
సావిత్రి ప్రాణాలు కాపాడిన అక్కినేని..

మూగమనసులు సినిమా షూటింగ్ టైమ్ లో ఓ ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో షూటింగ్ జరుగుతున్న టైమ్ లో సావిత్రికి ఘోర ప్రమాదం జరిగింది. ఈ నాటి ఈ బంధమేనాటిదో పాటకి ఐ.ఎల్.టి.డి పెట్రోల్ బోటులో చిత్రీకరణ జరుగుతోంది. గంటకు పదికిలోమీటర్ల వేగంతో ఆ బోటును ఆనకట్ట దగ్గర నడిపిస్తున్నారు. ఆ బోటుపై సావిత్రి, నాగేశ్వరరావు ఉన్నారు. వేరే బోటుమీద కెమెరా, డైరెక్టరు ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. సావిత్రి ఒక షాట్ లో .. బోటుపై ఉన్న జెండా కర్ర పట్టుకుని వయ్యారంగా వెనక్కి వాలింది. హఠాత్తుగా ఆ కర్ర విరిగిపోగా సావిత్రి గోదారిలో పడిపోయింది. అలా పడటంతోనే.. ఆమె చీర వెళ్లి.. బోటుకింద ఉండే మోటారుచక్రంలో ఇరుక్కుని చీర అంతా చుట్టుకుపోయింది. దాంతో ఆమె బోటు అంచును చేత్తోపట్టుకుని అలాగే ఉండిపోయింది. బోటు ఆనకట్ట వైపుకు వెళ్తోంది. అక్కడికి వెళ్తే సావిత్రి జలపాతంలో పడికొట్టుకుపోతుంది. ఈలోగా అక్కినేని నాగేశ్వరరావు గమనించి ఆమెకు.. చేయందిస్తూ పైకి లాగబోయారు. కానీ గట్లపై వేలమంది జనం, తానేమో చీర జారిపోయివుంది, దాంతో సావిత్రి సిగ్గు, భయంతో పైకి రాలేకపోయింది. దాంతో నాగేశ్వరావు సావిత్రి ఇబ్బందిని గమనించి.. వెంటనే బోటులోని కాన్వాస్ షీట్ ను ఆమెకు అందించగా చుట్టుకుంది, ఇంతలో లాంచివాళ్ళూ, ఈతగాళ్ళూ చుట్టూ తమ తలగుడ్డలు అడ్డుపెట్టి నుంచోగా నాగేశ్వరరావు సాయంతో సావిత్రి బోటుపైకి ఎక్కారు. దాంతో పెనుప్రమాదం తప్పిపోయింది. ఈ సంఘటన జరగడంతో సావిత్రి చాన్నాళ్ళు గోదావరి పరిసరాల్లో అవుట్-డోర్ షూటింగుల్లో నటించలేదు. ఆరోజు సావిత్రి ప్రాణాలను అక్కినేని కాపాడారు.

77
మూగమనసులు సినిమా ఘన విజయం..

1964 జనవరి 31న నవయుగా ద్వారా ఈసినిమా ఘనంగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు నుంచే అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోయింది మూవీ. అంతే కాదు నిర్మాతలకు భారీగా లాభాలు కూడా తెచ్చిపెట్టింది. 19 కేంద్రాల్లో 100 రోజులు ఆడియన ఈసినిమా.. 9 థియేటర్లలో 175 రోజులు ఆడింది. అంతే కాదు ఈసినిమాను ఆతరువాత కాలంలో సావిత్రి దర్శకత్వంలో తమిళంలోకి 'ప్రాప్తం'గా, హిందీలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 'మిలన్'గా రీమేక్ చేయబడింది. ఈ రెండు భాషల్లో కూడా మూగ మనసులు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈసినిమాను చూడాలి అనకుంటే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories