Mirai Movie Review: మిరాయ్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. తేజ సజ్జా మరో బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడా?

Published : Sep 12, 2025, 12:20 PM IST

తేజ సజ్జా, మంచు మనోజ్‌, శ్రియా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం `మిరాయ్‌`. కార్తీక్‌ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఈ సూపర్‌ హీరో మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
17
మిరాయ్‌ మూవీ రివ్యూ

`హనుమాన్‌`తో సంచలనం సృష్టించాడు హీరో తేజ సజ్జా. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు `మిరాయ్‌` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు. శ్రియా, జగపతిబాబు, జయరాం, రితికా నాయక్‌ ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 12)న విడుదలైంది. సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో, మైథాలజీ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
`మిరాయ్‌` మూవీ కథ

కళింగ యుద్ధంలో అశోకుడు గెలిచాడు. కానీ యుద్ధభూమి మొత్తం రక్తపాతం అవుతుంది. ఒక్కరు కూడా బతకరు. దీంతో తాను యుద్ధం చేసిన ప్రయోజనం ఏంటనే పాశ్చత్తాప పడతాడు. తన వద్ద ఉన్న పవర్‌ అంతటిని తొమ్మిది గ్రంథాల్లో నిక్షేపిస్తాడు. అందులో చివరిది అమరత్వం. వాటిని యోధులైన, అర్హులైన వారి వద్ద ఉంచుతాడు. వారంతా ఆయా గ్రంథాలను తరాలుగా కాపాడుకుంటూ వస్తారు. చివరగా అమరత్వానికి సంబంధించిన గ్రంథం అంబిక(శ్రియా శరణ్‌) వద్ద ఉంటుంది. అయితే తాను వచ్చే ప్రమాదాన్ని ముందే గ్రహిస్తుంది. గ్రంథాలకు ముప్పు ఉందని, ఒక అసురుడు వాటిని ఛేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుంటుంది. గర్భంతో ఉన్న ఆమె హిమాలయాల్లో ఉన్న అగస్త్య మహర్షి వద్దకు వెళ్లి దీనికి పరిష్కారం తెలుసుకుంటుంది. అక్కడే కుమారుడికి జన్మనిస్తుంది. మహర్షి చెప్పిన ప్రకారం తన కుమారుడిని త్యాగం చేస్తుంది. ఆ కుమారుడికి  వేద(తేజ సజ్జా) అనే పేరుపెట్టి కాశీలో సాధువుల వద్ద వదిలేస్తుంది. అలా కాశీతోపాటు వివిధ ప్రాంతాల్లో పెరుగుతాడు వేద. ఆకాశంలో నక్షత్రాల దారిని బట్టి జర్నీ చేస్తూ చివరికి హైదరాబాద్‌లో సెటిల్‌ అవుతాడు. అతన్ని వెతుక్కుంటూ విభా(రితికా నాయక్‌) వస్తుంది. వేద ఎవరు? తన లక్ష్యం ఏంటనేది చెబుతుంది? మరోవైపు అసురుడు మహవీర్‌(మంచు మనోజ్‌) వరుసగా ఒక్కో గ్రంథాన్ని తన వశం చేసుకుంటూ మరింత శక్తివంతుడు అవుతుంటాడు. ఇలా 8 గ్రంథాలను పొందుతాడు. కానీ అమరత్వానికి సంబంధించిన చివరి గ్రంథం కోసం వెతుకుతుండగా, వేదాని కలిస్తే లభిస్తుందని తెలుసుకుంటాడు. మరి ఆయన ఎలా కలుసుకున్నాడు? మహావీర్‌ని వేద ఎలా ఎదుర్కొన్నాడు. అత్యంత శక్తివంతమైన ఆయుధం మిరాయ్‌ని వేద ఎలా సాధించాడు? దాని ద్వారా మహావీర్ ఎలా అడ్డుకున్నాడు? అనేది మిగిలిన కథ.

37
`మిరాయ్‌` మూవీ విశ్లేషణః

ప్రస్తుతానికి, మైథాలజీ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. `కాంతార`, `హనుమాన్‌`, `కల్కి` వంటి సినిమాలు అలా మంచి ఆదరణ పొందాయి. ఆ కోవలోనే వచ్చిన మూవీ `మిరాయ్‌`. ప్రస్తుతానికి, పురాణ, ఇతిహాసాలను జోడించి ఈ మూవీని రూపొందించాడు దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని. కాకపోతే ఇందులో `హనుమాన్‌` ఫ్లేవర్‌ ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా ప్రారంభంలో అశోకుడి కళింగ యుద్ధం, దాని పర్యావసానాలు, ఆ తర్వాత తాను సంపాదించిన శక్తిని గ్రంథాల్లో నిక్షేపం చేయడం వంటివి ఇంట్రెస్టింగ్‌ కథాంశంతో, ప్రభాస్‌ వాయిస్‌ ఓవర్‌తో సినిమాపై హైప్‌ పెంచాడు దర్శకుడు. ప్రారంభంలోనే ఆయా అంశాలు ఆసక్తికరంగా ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి. ఆ తర్వాత వేద పెరిగిన జర్నీని చూపించారు. అనంతరం హైదరాబాద్‌లో సెటిల్‌ కావడాన్ని చూపించి అక్కడి నుంచి కథలోకి వెళ్లారు. ఓ వైపు వేదని తన లక్ష్యానికి దగ్గర చేయడం, మరోవైపు మహావీర్‌ ఒక్కోగ్రంథాన్ని దక్కించుకుంటూ మరింత శక్తివంతం కావడం పారలల్‌గా చూపించడం బాగుంది. అదే సమయంలో తేజ సజ్జ, తన ఫ్రెండ్స్ తో గెటప్‌ శ్రీను చేసే కామెడీ నవ్వించేలా ఉంటుంది. దీనికితోడు సీఐగా దర్శకుడు కిశోర్‌ తిరుమల చేసే ఆపరేషన్‌ వంటి సన్నివేశాలు ఫన్నీగా మలిచారు. సరదాగా సినిమాని ప్రారంభించి సీరియస్‌గా తీసుకెళ్లిన తీరు బాగుంది. ఆడియెన్స్ లో అది ఉత్సుకతని రేకెత్తిస్తుంది. ప్రస్తుత కాలానికి మైథాలజీ, సూపర్‌ పవర్‌ అంశాలు జోడించి తీరు కూడా బాగుంది. మొదటి భాగం వేద మిరాయ్‌ని సాధించడం వరకు చూపించారు. సెకండాఫ్‌లో దాని గురించి తెలుసుకోవడం, ఆ శక్తిని పొందడం, అనంతరం విలన్‌పై పోరాటానికి సిద్ధం కావడం, విలన్‌ క్రియేట్‌ చేసే డిస్టర్బెన్స్ ని ఎదుర్కోవడం వంటి అంశాలతో సాగుతుంది. ఫైనల్‌గా ఈ ఇద్దరు కలిసే క్లైమాక్స్ మాత్రం అదిరిపోయేలా ఉంది.

47
`మిరాయ్‌` మూవీ హైలైట్స్, మైనస్ లు

సినిమా ఒక్క లేయర్‌ కాకుండా డిఫరెంట్‌ లేయర్స్ ఉంటాయి. ఓ వైపు వేద జర్నీ, మరోవైపు మహావీర్‌ జర్నీ, ఇంకోవైపు విభా లక్ష్యం కోసం వెళ్లడం, అలాగే అంబిక భవిష్యత్‌ని చెప్పడం, జరగబోయేది, తాను చేయాల్సింది కొడుక్కి చెప్పడం వంటి అంశాలతో టైట్‌ స్క్రీన్‌ ప్లేతో రన్‌ అవుతుంది. ఇదే ఇందులో హైలైట్‌గా చెప్పొచ్చు. ఇవన్నీ ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసేలా సాగుతాయి. ఆద్యంతం ఆకట్టుకుంటాయి. యాక్షన్‌ సీన్లలోనూ సూపర్‌ పవర్స్ ని జోడించడంతో ఆయా ఎపిసోడ్స్ వాహ్‌ అనేలా ఉంటాయి. ఆద్యంతం కట్టిపడేస్తాయి. ప్రత్యర్థులతో తేజ పోరాటం కట్టిపడేస్తుంది. మరోవైపు సెకండాఫ్‌లో మిరాయ్‌ని చేరుకునే సమయంలో పక్షితో చేసే యాక్షన్‌ సీన్‌ కూడా బాగుంది. అనంతరం క్లైమాక్స్ కి దారి తీసే అంశాలు, ట్రైన్‌ ఎపిసోడ్‌తోపాటు క్లైమాక్స్ గూస్‌ బంమ్స్ తెప్పిస్తాయి. జస్ట్ వాహ్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. దీనికితోడు బీజీఎం కూడా అదిరిపోవడంతో మరో కొత్త అనుభూతి మనకు కలుగుతుంది.

అయితే ఇంతవరకు ఓకే కానీ, స్క్రీన్‌ ప్లే ఊహించేలా ఉంది. మొదటి భాగంలో ఉన్నంత గ్రిప్పింగ్‌గా సెకండాఫ్‌లో లేదు. కొంత డైవర్షన్‌లాగా అనిపిస్తుంది. కథ సీరియస్‌గా సాగుతుంటే మధ్యలో దర్శకులు కిశోర్‌ తిరుమల, వెంకటేస్‌ మహాల కామెడీ ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. ఏమాత్రం సెట్‌ కాలేదు. దీనికితోడు కొన్ని అంశాలు లాజికల్‌గా కనెక్ట్ కాలేకపోతాం. సినిమా చాలా వరకు `కల్కి`, `ఖలేజా`, `హనుమాన్‌` చిత్రాలను తలపిస్తుంది. హనుమాన్‌ స్క్రీన్‌ప్లేకి దగ్గరగా ఉందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇంకోవైపు ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో క్యారీ అవలేదు. సెకండాఫ్‌లో ఆ ఫీల్‌ మిస్‌ అయ్యాయి. యాక్షన్‌ సీన్లు బాగున్నాయి, కానీ దానికి దారితీసే అంశాలు, అందులో భావోద్వేగాలు ఆశించిన స్థాయిలో లేవు. చాలా వరకు తేలిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. క్లైమాక్స్ లో రాముడి ఎపిసోడ్‌ కూడా ఆడియెన్స్ ఎక్స్ పెక్ట్ చేసేలా లేదు. దీంతో ఓ కొరత ఉంటుంది. కథనం రకరకాలుగా తిరిగిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక్కడ దర్శకుడు మరింత కేర్‌ తీసుకోవాల్సింది. కథని ఒక ఫ్లోలో తీసుకెళ్తే బాగుండేది. క్లైమాక్స్ కూడా ఇంకా బాగా ఎమోషనల్‌గా, డీవోషనల్‌గా తీర్చిదిద్దితే సినిమా అదిరిపోయేది.

57
`మిరాయ్‌` నటీనటులు ఎలా చేశారంటే?

వేదగా ఇందులో తేజ సజ్జా నటించారు. పాత్రలో ఒదిగిపోయాడు. సింపుల్‌గా ఉంటూనే హీరోయిజం చూపించిన తీరు బాగుంది. యాక్షన్‌ సీన్లలో అదరగొట్టాడు. అతని పాత్రనే సినిమాకి పెద్ద అసెట్‌. తాను కూడా అంతే బాగా చేసి సినిమాకి ప్రాణం పోశాడు. ఇక అసురుడు మహావీర్‌గా మంచు మనోజ్‌ బాగా చేశాడు. బాగా సెట్‌ అయ్యాడు. అంతే బాగా చేశాడు. వాహ్‌ అనిపించాడు. ఆయన సీన్లు కూడా అదిరిపోయేలా ఉన్నాయి. ఇక శ్రియా శరణ్‌ మరో బలమైన పాత్రలో కనిపిస్తుంది. ఆమె సినిమా అంతా కనిపిస్తుంది. శ్రియాకిది మంచి కమ్‌ బ్యాక్‌ లాంటి పాత్ర అవుతుంది. కెరీర్‌కి పెద్ద ప్లస్‌ అవుతుంది. ఇక జగపతిబాబు కనిపించిన కాసేపు మెప్పించారు. కానీ ఆయన పాత్ర అంత బలంగా లేదు. జయరామ్‌ కనిపించినంత సేపు ఆకట్టుకున్నారు. గెటప్‌ శ్రీను నవ్వించాడు. దర్శకుడు కిశోర్‌ తిరుమలలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించారు. హ్యూమర్‌ బాగుంది. నటుడిగా బిజీ అయిపోతాడేమో. వెంకటేష్‌ మహా ఓకే అనిపించాడు. హీరోయిన్‌ రితికా నాయక్‌ బాగా చేసింది. మంచి ప్రయారిటీ ఉన్న పాత్ర ఆమెకి పడింది. మిగిలిన ఆర్టిస్ట్ లు ఓకే అనిపించారు.

67
`మిరాయ్‌` టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమాకి హరి గౌర సంగీతం ప్లస్‌ అయ్యింది. బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్‌ అదిరిపోయింది. ముఖ్యంగా `రుధిరం` పాట గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. ఆ పాటే సినిమాకి బిగ్గెస్ట్ అసెట్‌. దర్శకుడు కార్తీక్‌ కెమెరా వర్క్ కూడా బాగుంది. విజువల్స్ గ్రాండియర్‌గా, విజువల్‌ వండర్‌గా సినిమాని మలిచాడు. విజువల్స్ మరో పెద్ద అసెట్‌. ఎడిటింగ్‌ పర్వాలేదు. సెకండాఫ్‌లో మరింత కేర్‌ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని ఎంచుకున్న కథ బాగుంది. ఊహించని విధంగా ఉంది. అయితే మైథాలజీ అంశాల విషయంలో ఎక్కువ ఫ్రీడం తీసుకున్నారు. కొన్నిలాజిక్స్ కి అందని విధంగా ఉన్నాయి. సెకండాఫ్‌ విషయంలో కేర్‌ తీసుకోవాల్సింది. కథని డైవర్స్ చేసే సీన్లని కట్‌ చేయాల్సింది. క్లైమాక్స్ ని ఇంకాస్త బెటర్‌గా చేయాల్సింది. రాముడి పాత్ర విషయంలో ఆడియెన్స్ కొంత డిజప్పాయింట్‌ అవుతారు. కాకపోతే పిల్లలు, పెద్దలు కలిసి చూసేలా సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. చాలా నీట్‌గా ఉంది. చాలా పెద్ద కథని బ్లెండ్‌ చేసిన తీరు మాత్రం అదిరిపోయింది. టెక్నికల్‌గా మూవీ సాలిడ్‌గా ఉందని చెప్పొచ్చు.

77
ఫైనల్‌ నోట్‌

 `కల్కి`, `హనుమాన్‌` తరహాలో ఆద్యంతం కట్టిపడేసే మూవీ `మిరాయ్‌`. పిల్లలు,పెద్దలు కలిసి చూసే మంచి క్లీన్‌ ఎంటర్‌టైనర్‌.

రేటింగ్‌ః 3.25

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories